దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన నైజాం ఏరియా హక్కులు ఏకంగా 90 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఒక హారర్ కామెడీ జోనర్ సినిమాకు, కేవలం ఒక రీజియన్‌లో ఈ స్థాయి ధర పలకడం ప్రభాస్ స్టార్ పవర్‌కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
నైజాం రైట్స్ విషయంలో ప్రభాస్ తన పాత రికార్డులను తానే తిరగరాస్తూ, టాలీవుడ్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశాడని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా, ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు క్రేజ్ ఉండటంతో డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా భారీ ధరకే అమ్ముడవుతున్నాయని సమాచారం.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తోంది. వింటేజ్ ప్రభాస్‌ను చూస్తామన్న ఆశతో అభిమానులు ఉండగా, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఒకవైపు బడ్జెట్, మరోవైపు ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తుంటే 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి