ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో తెరకెక్కించిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ది రాజాసాబ్. ఇందులో మాళవిక మోహన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, ట్రైలర్ సినిమా పైన అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలిసి అభిమానులు ఎగ్జైటింగ్ గానే ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టికెట్ల ధరలు విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.


ప్రభాస్ నటించిన ఈ హర్రర్ కామెడీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ముఖ్యంగా ఏపీ నుంచి ప్రత్యేక అనుమతులు ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి వచ్చినట్లు వినిపిస్తున్నాయి. సినిమా టికెట్ ధరలు భారీగానే పెరిగినట్లు వినిపిస్తున్నాయి. ఇక విడుదల రోజు ఉదయం షోల విషయంలో మేకర్స్ ఒక అడుగు ముందుకు వేసి జనవరి 8 రాత్రి 9 గంటలకే ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేసేలా ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోల కోసం టికెట్ ధర రూ. 1000(జీఎస్టీ) తో కలిపి నిర్ణయించారు. ప్రభాస్ సినిమా ముందుగానే చూడాలనుకునే అభిమానులు ఇంత  ధర హపెట్టాల్సిందే.



ఇక సినిమా విడుదలైన తర్వాత సాధారణ షోల కోసం ప్రధాన నగరాలలో మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.377 రూపాయలు ఉండగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.297 రూపాయలుగా నిర్ణయించారు. సాధారణ సినిమా టికెట్ రేటు కంటే భారీగానే పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో కచ్చితంగా ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలోనే రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా ఈ టికెట్ ధరలకు సంబంధించి జీవోని ఇంకా విడుదల చేయలేదు. మరి చిత్ర బృందం అఫీషియల్ గా టికెట్ ధరలకు సంబంధించి జీవోని విడుదల చేస్తారమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: