ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ వంటి అగ్ర హీరోలు ఇలాంటి వైవిధ్యమైన కథలను స్వాగతించి, సినిమాలు చేయడానికి ముందుకు రావడమే ఒక ప్రత్యేకమైన విషయమని ఆయన కొనియాడారు. సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారని, ఈ సమయంలో కుటుంబ కథా చిత్రాలు వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన సినిమాల్లో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, ఈసారి బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయని, అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని అనిల్ చెప్పుకొచ్చారు.
కేవలం దర్శకత్వంపైనే కాకుండా సినిమా నిర్మాణ వ్యయంపై కూడా తనకు పూర్తి అవగాహన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒక రకంగా నిర్మాత కంటే తానే సినిమా ఖర్చు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటానని, బడ్జెట్ వృథా కాకుండా ప్లాన్ చేస్తానని పేర్కొన్నారు. ఇక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ, కింగ్ నాగార్జునతో సినిమా చేయాలనే బలమైన కోరిక తనకు ఉందని వెల్లడించారు. ఒకవేళ నాగార్జునతో సినిమా గనుక పట్టాలెక్కితే, టాలీవుడ్‌లోని నలుగురు సీనియర్ అగ్ర హీరోలతో (చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున) పనిచేసిన అరుదైన రికార్డు తన ఖాతాలో చేరుతుందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. అనిల్ రావిపూడి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి