తెలుగు ,తమిళ భాషలలో తన చిత్రాలను విడుదల చేస్తు అలరిస్తూ ఉంటారు హీరో విశాల్. డైరెక్టర్ సుందర్.సి దర్శకత్వంలో తాజాగా ఒక చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి మొగుడు అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర బృందం తెలియజేస్తూ 5 నిమిషాల నిడివి ఉన్న వీడియోని సైతం అభిమానులతో పంచుకున్నారు. విశాల్ కి 36వ చిత్రం. తమన్నా ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే యోగి బాబు కమెడియన్ గా కనిపించబోతున్నారు.


తాజాగా విడుదలైన టైటిల్ ప్రోమో విషయానికి వస్తే.. తమన్నా భర్తకు ఆర్డర్ వేసే భార్యగా ఇందులో కనిపిస్తోంది. విశాల్ ఒకవైపు ఇంట్లో పనులు చేస్తూనే మరొకవైపు యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేస్తున్నారు. యోగిబాబు కూడా తన కామెడీతో బాగానే నవ్వులు పూయించేల కనిపిస్తున్నారు. ఈ సినిమా ఒకవైపు కామెడీ ,మరొకవైపు యాక్షన్ తీరుతో తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తోంది. మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం అనే డైలాగ్ యోగిబాబు సీరియల్ నటుడుగా చెబుతూ అందరిని నవ్విస్తారు.



వాస్తవంగా డైరెక్టర్ సుందర్ విశాల్ సినిమా కంటే ముందు రజనీకాంత్ తో సినిమా తెరకెక్కించే అవకాశం లభించింది. రజనీకాంత్ సుందర్ కలయికలో వచ్చిన మొదటి చిత్రం అరుణాచలం. ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇన్ని ఏళ్లకు సినిమా ప్రకటించగా, కమలహాసన్ నిర్మాణ సంస్థలో ఈ సినిమా పట్టాలెక్కుతుందని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని కారణాల చేత ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కొద్ది రోజులకే డైరెక్టర్ సుందర్ ప్రకటించారు. అలా ఆ సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత హీరో విశాల్ తో మొగుడు అనే సినిమాని తెరకెక్కించినట్లు సమాచారం. చూస్తూ ఉంటే ఈ మధ్య కామెడీ సినిమాల హవా బాగా కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది మరి ఈ సినిమాతో విశాల్ హిట్ కొడతారేమో చూడాలి.


మొగుడు సినిమా అంటే ప్రతి ఒక్కరికి కృష్ణవంశీ, గోపీచంద్, తాప్సి కలయికలో వచ్చిన సినిమా టైటిల్ గుర్తుకువస్తుంది. 2011లో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు అదే టైటిల్ తో  విశాల్ రావడం గమనార్హం. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: