కొంతమంది నిర్మాతలు తీసే సినిమాలు ఫ్లాప్ అయితే ఆ రిజల్ట్ మొత్తం హీరోల మీద, హీరోయిన్ల మీద,దర్శకుల మీద వేసేస్తారు. హిట్ అయితే నిర్మాతలకు సంతోషం కాకపోతే ఇబ్బందులు పడుతూ ఉంటారు.అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిర్మాత కూడా ఉన్నారు. ఆయనే అనిల్ సుంకర.. నిర్మాత అనిల్ సుంకర తాజాగా శర్వానంద్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమాతో హిట్టు కొట్టారు. చాలా రోజుల తర్వాత ఈయన మంచి హిట్ సినిమా నిర్మించడంతో సంతోషంలో మునిగిపోయారు.అయితే రీసెంట్ గా వచ్చిన అఖండ-2 మూవీ హిట్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయింది.దాంతో అనిల్ సుంకర పరిస్థితి దారుణంగా మారిపోయింది. 

అంతకు ముందు శ్రీ విష్ణు నటించిన సామజవరగమన హిట్ అయినప్పటికీ ఈ సినిమా కంటే ముందు వచ్చిన ఏజెంట్, భోళా శంకర్ వంటి సినిమాలు భారీ డిజాస్టర్ అవ్వడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.అయితే తాజాగా వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా హిట్ కొట్టడంతో ఆయన సక్సెస్ సెలబ్రేషన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిల్ సుంకర నారి నారి నడుమ మురారి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఏజెంట్,భోళా శంకర్ లాంటి ప్లాప్ సినిమాలు తీసిన సమయంలో నా ఫ్రెండ్స్,ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎందుకు ఇలాంటి చెత్త సినిమాలు తీస్తున్నావు అని తిట్టేవారు.ఆ సమయంలో సినిమా డిజాస్టర్ అయ్యింది అనే బాధ కంటే వాళ్లు అనే మాటలే నన్ను మరింత బాధ పెట్టేవి.

 కానీ నారీ నారీ నడుమ మురారి సినిమా విడుదలయ్యాక మా అమ్మకి కాల్ చేసి అమ్మ నీకు టికెట్ బుక్ చేశాను. వెళ్లి సినిమా చూడు. సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకో..నీ కొడుకు మంచి సినిమా తీశాడు అంటూ చాలా గర్వంగా చెప్పాను అంటూ అనిల్ సుంకర సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ సుంకర మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు నిర్మాత అనిల్ సుంకరకి పెద్ద హీరోలు కలిసి రావడం లేదు. పెద్ద హీరోలతో సినిమాలు చేసినప్పుడల్లా డిజాస్టర్స్ అయ్యి అప్పుల పాలవుతున్నారు. కానీ చిన్న హీరోలతో చేసే సినిమాలు మాత్రం అనిల్ సుంకరకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: