టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరోగా నటించాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహు గారపాటి , సుష్మిత కొణిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. భీమ్స్ సిసిరిలీయో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను జనవరి 11 వ తేదీన ప్రదర్శించారు. ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమాకు విడుదల తేదీ నుండి అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే బుక్ మై షో లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా విడుదల అయిన దగ్గర నుండి ఇండియా వ్యాప్తంగా అత్యధిక టికెట్లు బుక్ మై షో లో సెల్ అయిన సినిమాగా ఈ సినిమా చాలా రోజుల పాటు కంటిన్యూ అయ్యింది. తాజాగా బుక్ మై షో లో ఈ సినిమా కంటే ఎక్కువ టికెట్లు తాజాగా ఓ మూవీ గా బోర్డర్ 2 నిలిచింది. ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో లో హిందీ సినిమా అయినటువంటి బార్డర్ 2 మూవీ కి 82.25 కే టికెట్లు సేల్ అవగా ... మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కి 24 గంటల్లో బుక్ మై షో ఆప్ లో 49.49 కే టికెట్లు సేల్ అయ్యాయి. ఇలా ఆఖరి 24 గంటల్లో మన శంకర వర ప్రసాద్ గారు మూవీ కంటే కూడా బర్డర్ 2 మూవీ కి సంబంధించిన టికెట్లు బుక్ మై షో లో ఎక్కువగా సేల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: