ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాలను మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. అలా ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలలో కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. ఇలా కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తూ ఉండడంతో అనేక మంది నిర్మాతలు తమ సినిమాలను రీ రిలీజ్ చేయడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తూ వస్తున్నారు. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమంలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈయన ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం అజిత్ కుమార్ "మంకత్త" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అర్జున్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. తమిళ నాడు ప్రాంతంలో ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 50 కే టికెట్స్ చెన్నై ప్రాంతంలో సేల్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విధ్వంసాన్ని సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak