జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి చెందినవాడే అయినప్పటికీ ఆయన్ని నందమూరి ఫ్యామిలీ పూర్తిగా దూరం పెట్టింది. అటు నారా ఫ్యామిలీ కూడా ఆయన్ని దగ్గరకు తీయడం లేదు.కానీ ఆయన మాత్రం తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. గతంలో నందమూరి ఫ్యామిలీ ఆదరణకు నోచుకున్న ఎన్టీఆర్ మళ్ళీ నందమూరి ఫ్యామిలీతో వెలివేయబడ్డాడు. అయితే వారి మధ్య ఫ్యామిలీ గొడవలు ఏమున్నాయో తెలియదు కానీ చాలా మంది నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణ, ఎన్టీఆర్ లు కలిస్తే బాగుండు..ఆ సన్నివేశాన్ని ఎప్పుడు చూస్తామో అని అనుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ చిన్నల్లుడు ఎంపీ శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి.మరి ఇంతకీ బాలకృష్ణ చిన్నల్లుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్లు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు.. అందులో పెద్ద కూతురు బ్రాహ్మిణి, చిన్న కూతురు తేజస్విని.. బ్రాహ్మిణి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ని పెళ్లి చేసుకుంది.తేజస్విని గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ భరత్ ని పెళ్లాడింది. శ్రీ భరత్ యూనివర్సిటీని చూసుకోవడంతో పాటు ఇటు రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు.ఆయన టిడిపి పార్టీ తరఫున జరిగిన ఎలక్షన్స్ లో విశాఖపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఎంపీ పదవిని అధిరోహించారు. అయితే అలాంటి శ్రీ భరత్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వెరీ టాలెంటెడ్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్ లోని డాన్స్, యాక్టింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి స్పెషాలిటీస్ ఎన్నో ఉన్నాయి.

ఆయన యాక్టింగ్,డ్యాన్స్ తో పాటు స్టేజ్ మీద ఆయన ఇచ్చే స్పీచ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇలాంటి వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ స్టేజి మీద ఇచ్చే స్పీచ్ ని విని నేను చాలా నేర్చుకున్నాను. అలాంటోడికి కచ్చితంగా చాలామంది అభిమానులు ఉంటారు.ఇందులో డౌటే లేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ పై తన అభిప్రాయాన్ని బయట పెట్టారు బాలకృష్ణ చిన్నల్లుడు ఎంపీ శ్రీ భరత్.. ప్రస్తుతం శ్రీ భరత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక్క బాలకృష్ణకు మాత్రమే నచ్చదు. బాలకృష్ణ ఇంట్లో వారందరికీ ఎన్టీఆర్ అంటే అభిమానమే అంటూ కామెంట్లు  పెడుతున్నారు.m

మరింత సమాచారం తెలుసుకోండి: