1. ఎస్.ఎస్. రాజమౌళి:
టాలీవుడ్ కమర్షియల్ సినిమా అంటే రాజమౌళి పేరే మొదట వినిపిస్తుంది. ఒక్క ఫ్లాప్ కూడా లేని ఏకైక దర్శకుడు ఈయన. 'బాహుబలి', 'RRR' సినిమాలతో తెలుగు సినిమాను ఆస్కార్ వరకు తీసుకెళ్లిన జక్కన్న, ఇప్పుడు మహేష్ బాబుతో గ్లోబల్ అడ్వెంచర్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే అది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జాతర. బాక్సాఫీస్ వద్ద ఈయన వేసే స్కెచ్ చూసి బాలీవుడ్, హాలీవుడ్ సైతం షాక్ అవ్వాల్సిందే.
2. సుకుమార్:
'పుష్ప' సినిమాతో సుకుమార్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. క్యారెక్టర్ డ్రివెన్ కథలను కమర్షియల్‌గా ఎలా తీయాలో సుకుమార్‌కు తెలిసినట్లు ఇంకెవరికీ తెలియదు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో కొత్తదనం చూపిస్తూ 'పుష్ప 2'తో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్‌పై కన్నేశారు. సుకుమార్ రాసే ఒక్కో సీన్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది.
3. త్రివిక్రమ్ శ్రీనివాస్:
ఫ్యామిలీ ఎమోషన్స్ కు మాస్ ఎలిమెంట్స్ జోడించి బ్లాక్ బస్టర్లు కొట్టడం త్రివిక్రమ్ స్టైల్. 'అల వైకుంఠపురములో' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత, మహేష్ బాబుతో 'గుంటూరు కారం' అంటూ మాస్ జాతర చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి ఏకంగా ₹1000 కోట్ల బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. గురూజీ మార్క్ డైలాగులు థియేటర్లలో పేలితే ఆ మజానే వేరు.
4. అనిల్ రావిపూడి:
వరుసగా ఏడు హిట్లతో టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి దూసుకుపోతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమా ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అనిల్ క్రేజ్ ఆకాశానికి చేరింది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ మాస్ ఎలివేషన్లను కలపడంలో ఈయన సిద్ధహస్తుడు. నిర్మాతలకు అత్యధిక లాభాలు తెచ్చిపెట్టే దర్శకుల్లో అనిల్ ఒకరు.
5. సందీప్ రెడ్డి వంగా:
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలతో టాలీవుడ్‌లో మాస్ డెఫినిషన్ మార్చేసిన దర్శకుడు సందీప్ వంగా. హీరోను వైల్డ్ గా చూపించడంలో ఈయనకు ఎవరూ సాటిరారు. ఇప్పుడు ప్రభాస్‌తో 'స్పిరిట్', అల్లు అర్జున్‌తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టారు. సందీప్ సినిమా అంటే బాక్సాఫీస్ దగ్గర రక్తపాతం గ్యారెంటీ!
6. కొరటాల శివ & ప్రశాంత్ నీల్:
సోషల్ మెసేజ్ కు మాస్ మసాలా అద్ది 'దేవర'తో ఎన్టీఆర్‌ను గ్లోబల్ లెవల్‌లో నిలబెట్టారు కొరటాల శివ. ఇక ప్రశాంత్ నీల్ గురించి చెప్పక్కర్లేదు.. 'సలార్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి 'డ్రాగన్' వేట మొదలుపెట్టారు.ఈ దర్శకులందరికీ ఒకే ఒక లక్ష్యం.. అది థియేటర్లలో మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించడం. వీరి రెమ్యూనరేషన్లు కూడా ఇప్పుడు ₹50 కోట్ల నుంచి ₹100 కోట్ల వరకు ఉన్నాయంటే వీరి డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ బాక్సాఫీస్ ఈ దిగ్గజ దర్శకుల చేతుల్లో భద్రంగా ఉంది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి