మెగాస్టార్ చిరంజీవి హీరో గా నయనతార హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఇప్పటి వరకు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 14 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎన్ని ..? ఈ సినిమా ఇప్పటికి ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

14 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 43.08 కోట్ల కలెక్షన్లు దక్కగా , సిడెడ్ లో 21.22 కోట్లు , ఉత్తరాంధ్ర లో 20.58 కోట్లు , ఈస్ట్ లో 14.76 కోట్లు , వెస్ట్ లో 9.32 కోట్లు , గుంటూరు లో 10.66 కోట్లు , కృష్ణ లో 10.38 కోట్లు , నెల్లూరులో 6.28 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 14 తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో ఈ మూవీ కి 136.28 కోట్ల షేర్ ... 206.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 14 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 12.60 కోట్లు , ఓవర్సీస్ లో 18.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 14 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 167.78 కోట్ల షేర్ ... 273 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 120.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 122 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 45.78 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: