ఆ రెండు సినిమా ల వ ల్ల టాలీవుడ్కి ఎదు రు దెబ్బ.. అందరి టార్గెట్ అదే కావడం సమస్యనా..?

సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా  ,దర్శకుడు అయినా ,నిర్మాత అయినా కూడా తమ సినిమాలను చాలా హాలిడేస్ కలిసి వచ్చే తేదీలలో  విడుదల చేయాలి అని అనుకుంటారు . అందులో భాగంగా 2026 సమ్మర్ కానుకగా మర్చి నెలలో మన తెలుగు సినీ పరిశ్రమకి సంబందించిన  క్రేజీ సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. ఇక అనూహ్యంగా దాదాపు అదే తేదీలలో మరియు ఆ తేదీలకి చాల దగ్గరగా ఒక హిందీ సినిమా మరియు ఒక కన్నడ సినిమా విడుదల కూడా ఉండడం ఆ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉండడంతో  మన తెలుగు సినిమాలు పోస్టుపోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు చాల రోజులుగా వస్తున్నాయి. 

ఆ వార్తలకి తగినట్టే మర్చి 26 వ తేదీన విడుదల  కానున్నట్లు ప్రకటించిన ది  ప్యారడైజ్ , మర్చి 27 వ తేదీన విడుదల కానున్న పెద్ది కూడా పోస్టుపోన్ అయినట్లు వార్తగాలు వస్తున్నాయి. ఇక మర్చి 19 వ తేదీన విడుదల కావాల్సిన డేకాయిట్  మూవీ కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే మర్చి నెలలో టాక్సిస్  , దురంధర్ సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాలపై మంచి అంచనాలు ఉండడం , అలాగే హిందీ మార్కెట్లో కూడా ఆ రెండు సినిమాలపై బారి అంచనాలు ఉండడం  ,  డెకాయిట్  , పెద్ది  , ది ప్యారడైజ్ మూవీ బృందాలు కూడా హిందీ మార్కెట్ పై ఫోకస్ పెట్టడంతో మర్చి నెలలో కాకుండా వేరే నెలల్లో తమ సినిమాలను విడుదల చేయాలి అని ఈ  మూడు మూవీ బృందాల వారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: