వా వాతియార్ చిత్రం ఇటీవల విడుదల కాగా మిక్స్డ్ టాక్ ని సంపాదించుకుంది. దీంతో కృతి శెట్టి ఆశలన్నీ కూడా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో వస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం పైనే ఉన్నవి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో హీరోగా ప్రదీప్ రంగనాథన్ నటించారు. ఇందులో కీలకమైన పాత్రలో ఎస్ జె.సూర్య కూడా నటిస్తున్నారు. గత ఏడాది విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు తాజాగా ఫిబ్రవరి 12 న ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.
కృతి శెట్టి కెరియర్ మొత్తం ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా మీద ఆధారపడింది. ఒకవేళ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోతే అటు తెలుగు తమిళంలో కూడా ఈమెకు అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కృతి శెట్టికి ఈ సినిమా క్రేజీ తెచ్చి పెడుతుందా ?లేకపోతే ఇండస్ట్రీకి దూరమయ్యేలా చేస్తుందా అనే విషయం అభిమానులలో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎన్నోసార్లు వాయిదా పడిన వా వాతియార్ చిత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. మరి ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కృతి శెట్టి కి అదృష్టం తీసుకువస్తుందేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి