యువ హీరో నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ సురవరం. తమిళంలో ఆల్రెడీ హిట్టైన కణితన్ మూవీ రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

 

కథ :

 

అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్ సిద్ధార్థ్) టివి99 రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు. స్టింగ్ ఆపరేషన్స్ చేయడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే అర్జున్ బిబిసిలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తాడు. అందుకోసం బాగా కష్టపడతాడు. అయితే అలాంటి టైంలోనే అర్జున్ సురవరం ఫేక్ సర్టిఫికెట్ కేసులో ఇరుక్కుంటాడు. అసలు అర్జున్ ఎలా ఆ కేసు లో ఇరుకుతాడు..? అతన్ని దానిలో ఇరికించింది ఎవరు..? జర్నలిస్ట్ తలచుకుంటే ఏం చేయగలడు అన్నది సినిమా కథ.

 

విశ్లేషణ :

 

మాములుగా కొన్ని కథలు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తారు. కణితన్ రీమేక్ గా వచ్చిన అర్జున్ సురవరం కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. నిఖిల్ సిన్సియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంటే అతని మీద ఫేస్ సర్టిఫికెట్ నేరాన్ని మోపి అతన్ని టార్గెట్ చేస్తారు విలన్లు. అలాంటి పరిస్థితుల్లో ఉండే అర్జున్ ఎలా వాటి నుండి బయటపడ్డాడు ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు టి.ఎన్ సంతోష్.      

 

అయితే ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయన్న భావన కలుగుతుంది. కథ పాతదే.. కథనం సస్పెన్స్, థ్రిల్లర్ గా నడిపించాడు. అయితే సినిమా చూస్తున్నంతసేపు ఆల్రెడీ మనం చూసిన సినిమా చూస్తున్నామన్న భావన వస్తుంది. ఈ పాయింట్ తో సినిమా రాలేదు కాని ఇలాంటి కథతో సినిమాలు చాలానే వచ్చాయని చెప్పొచ్చు.

 

సినిమాలో ఎప్పటిలానే హీరో ముందు ఓడిపోవడం ఆ తర్వాత గెలవడం లాంటివి జరుగుతుంది. సినిమా సీరియస్ సబ్జెక్ట్ కు తగినట్టుగా కామెడీని కూడా పెట్టాడు. ఫైనల్ గా సినిమా యూత్ ఆడియెన్స్, వెరైటీ స్టోరీస్ నచ్చే వారికి మెప్పిస్తుది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది. 

 

నటీనటుల ప్రతిభ :

 

సినిమాలో అర్జున్ లెనిన్ సురవరం పాత్రలో నిఖిల్ మెప్పించాడు. ఇలాంటి ఇన్వెస్టిగేటెడ్ క్రైం థ్రిల్లర్ మూవీస్ లో చేసీ అనుభవం ఉంది కాబట్టి పాత్రలో మెప్పించాడు నిఖిల్ సిద్ధార్థ్. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి తన గ్లామర్ లో అలరించింది. హీరో హీరోయిన్ జోడీ బాగుంది. వెన్నెల కిశోర్, సత్య తమ పాత్రలతో మెప్పించారు. మిగతా వారంతా పాత్రల పరిధి మేరకు నటించారు. తరుణ్ అరోరా, కిశోర్ ల నటన మెప్పించింది.    

 

సాంకేతికవర్గం పనితీరు :

 

సినిమా దర్శకుడు టి.ఎన్ సంతోష్ తమిళ హిట్ మూవీని తెలుగులో యాజిటీజ్ దించేశాడు. ఓ ఇష్యూని చెప్పే క్రమంలో దర్శకుడు రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫార్మెట్ లా కాకుండా కొత్తగా ప్రయత్నిస్తే బాగుండేదని అనిపిస్తుంది. సాం సిఎస్ మ్యూజిక్ బాగుంది. బిజిఎం కూడా అలరించింది. కెమెరా వర్క్ ఇంప్రెస్ చేసింది. రాజ్ కుమార్ నిర్మాణ విలువలు బాగున్నాయి. 

 

ప్లస్ పాయింట్స్ :

 

నిఖిల్ 

సినిమాటోగ్రఫీ

యాక్షన్ సీన్స్

 

మైనస్ పాయింట్స్ :

 

ఊహించే కథనం 

అక్కడక్కడ స్లో అవడం

 

బాటం లైన్ :

 

అర్జున్ సురవరం.. నిఖిల్ ముద్ర వేయలేకపోయాడు..!

 

రేటింగ్ : 2.25/5

 

మరింత సమాచారం తెలుసుకోండి: