రొటీన్ సినిమాలు చూసి విసిగి వేసారిపోయిన వారికి కొత్తలోక మూవీ అనేది బెస్ట్ ఆప్షన్.. కేరళ జానపద కథలలో నీలి పాత్రను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా అని ఎక్కడో చదివాను. మన భారతీయ సినిమాల్లో సూపర్ హీరో జోనర్ చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా సూపర్‌హీరో సినిమాలు చాలా తక్కువ. ఈ క్రమంలో ఆ లోటును భర్తీ చేసేందుకు మలయాళ సినిమా మేకర్స్ లోక చిత్రంతో చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గదే. టైటిల్ పాత్రలో కళ్యాణి ప్రియదర్శి చాలా ఈజ్‌తో నటించింది. ఆమె తన హావభావాలను పలికించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషన్‌తో పాటు యాక్షన్‌లోనూ  అదరగొట్టింది .కొత్త లోక లో మెచ్చుకోవాల్సిన అంశం... మైథాలజీని సూపర్ హీరో కథగా మార్చిన తీరుకు! యక్షిణి గురించి పురాణాల్లో విన్నాం. ఆ యక్షిణిని బ్యాట్ మ్యాన్ తరహాలో చూపించడం బావుంది. రెగ్యులర్ సూపర్ హీరో కథలతో కంపేర్ చేసినా 'కొత్త లోక 1: చంద్ర' కొత్తగా ఉంటుంది.


కేరళ జానపద గాథలను ఆధునిక సూపర్‌హీరో టెంప్లేట్‌తో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ డామినిక్ అరుణ్. ఇలాంటి సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించడం గొప్ప విషయమే.దర్శకుడు డొమినిక్ అరుణ్, నిర్మాత దుల్కర్ సల్మాన్ తీసిన ఈ మూవీ యూనివర్శ్ లో ఇది తొలి భాగం మాత్రమే. అందువల్ల జవాబు దొరకని ప్రశ్నలు చాలానే ఉంటాయి.విజువల్స్, స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్సుల విషయంలో హాలీవుడ్ రిఫరెన్సులు ఈ సినిమాలో కనిపిస్తాయి. అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజ్ చేస్తుంది.గ్రాఫిక్స్ వర్క్ బాగుంది.కానీ కథలో భావోద్వేగం కుదరలేదు.. కథలోకి మనల్ని లీనం చేయడంలో డైరెక్టర్ ఫెయిల్అయ్యారు.చంద్ర-సన్నీ మధ్య ఏర్పడే బంధం తొలుత బాగానే అనిపించినా తర్వాత అదంత పెద్దగా మెప్పించదు. ఇప్పుడు వస్తున్న మన తెలుగు సినిమా మాదిరిగానే ఈ కథకు విలన్ మరియు సెకండాఫ్ కూడా మైనస్. నాచియప్ప గౌడ పాత్ర పెద్దగా మనల్ని మెప్పించదు.ఇలాంటి కథలకు విలనిజం బలంగా ఉండాలి.సెకండ్ హాఫ్‌లో స్లో పేస్ ఉండడం వల్ల సినిమా మీద ఆసక్తి పోతుంది.చంద్ర చుట్టూ చాలా సపోర్టింగ్ పాత్రలు తిరిగినా వాటికి సరైన ప్రాధాన్యత లేదు.దీంతో కథలో కన్ఫ్యూజన్ కూడా కొంతవరకు క్రియేట్  అవుతుంది.


సెకండ్ హాఫ్ లో టొవినో థామస్ ఎంట్రీ, సౌబిన్ షాహిర్ గెస్ట్ రోల్, క్లయిమాక్స్ లో దుల్కర్ సల్మాన్ కనిపించడం... ఇవి మలయాళీ ప్రేక్షకులకు కొంత ఆనందాన్ని కలిగించొచ్చు కానీ తెలుగువాళ్ళకు వీళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలాంటి అదనపు ఉత్సాహాన్ని ఇవ్వదు. రొటీన్ చిత్రాలకు ఈ చిత్రం కాస్తంత భిన్నంగా ఉందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.నటీనటుల విషయానికి వస్తే కళ్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్ ను సమర్థవంతంగా పోషించింది. యాక్షన్ సీన్స్ ఈజీగా చేసింది. మానసిక సంఘర్షణకు గురయ్యే సన్నివేశాలను బాగా ప్లే చేసింది. ఆమె బోయ్ ఫ్రెండ్ గా 'ప్రేమలు' ఫేమ్ నస్లెన్ నటించాడు. అతను, అతని మిత్రబృందం ద్వారా ప్రేక్షకులకు చెప్పుకోదగ్గ వినోదం లభించింది. పోలీస్ ఆఫీసర్ గా శాండి బాగా యాక్ట్ చేశాడు. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులు తెలుగువారికి పరిచయం లేని వారే.


ప్రభాస్ 'కల్కి'లో కీ-రోల్ ప్లే చేసిన అన్నా బెన్ ఇందులో సన్నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమా మెయిన్ హైలైట్ యానిక్ బెన్ యాక్షన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.ఈ సినిమాను తెలుగులో సితార నాగవంశీ విడుదల చేశారు. అయితే సినిమా పబ్లిసిటీలో చూపించిన నిర్లక్ష్యం సినిమా మీద కూడా చూపించడం బాధాకరం... తెలుగులో వచ్చిన టైటిల్ కార్డ్స్ లోనూ బోలెడన్ని తప్పులు దొర్లాయి.చివరిగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంది. డోంట్ మిస్ ఇట్.


- త్రినాధ రావు గరగ, సీనియర్ జర్నలిస్టు

మరింత సమాచారం తెలుసుకోండి: