రామ్ చరణ్ మూవీ 'నాయక్' యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రికార్డుస్థాయి కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఫస్ట్ డే ఏపీలో పది కోట్ల కలెక్షన్లు అందుకుని రికార్డు సృష్టించింది. రాష్ర్టంలో తొలి మూడు రోజుల్లో ‘నాయక్' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం-5.05 కోట్లు,
సీడెడ్-2.84కోట్లు,
నెల్లూరు-67 లక్షలు,
గుంటూరు-1.72 కోట్లు,
కృష్ణ-83 లక్షలు,
వెస్ట్ గోదావరి-1.11 కోట్లు,
ఈస్ట్ గోదావరి-1.13 కోట్లు,
వైజాగ్-1.52 కోట్లు.
తొలి మూడు రోజుల్లో మొత్తం ఏపీ షేర్-14.87 కోట్ల కలెక్షన్లు సాధించింది నాయక్. 'నాయక్' హిట్ టాక్ తెచ్చుకోనప్పటికీ భారీ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది. 'నాయక్' కలెక్షన్లకు అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. సంక్రాంతి సీజన్ కావడంతో పాటు ఈ సినిమాకు ఒకే ఒక్క సినిమా పోటీలో ఉంది. తొలిరోజు నాయక్ చిత్రం కేవలం ఏపీలోనే పదికోట్లు అందుకోవడం వెనుక భారీగా థియేటర్లు కేటాయించడం కారణంగా చెప్పుకోవచ్చు.
నాయక్ 9న విడుదలైతే ఆ రోజుతో పాటు 10న కూడా భారీగా థియేటర్లు కేటాయించారు. దాంతో రెండు రోజులు కళ్లు చెదిరే కలెక్షన్లు రాలాయని ట్రేడ్ టాక్. అయితే 11న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం విడుదలవ్వడంతో మూడో రోజు ‘నాయక్' థియేటర్ల సంఖ్య కాస్త తగ్గింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు వీకెండ్ హాలీడేస్, పండగ హాలీడేస్ పై కన్నేసింది. అంటే నాయక్ తొలి వారమంతా రికార్డు స్థాయి కలెక్షన్లు అందుకోనుందని విశ్లేషిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: