తెలుగు సినీ నటుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ మొదటగా హాస్య చిత్రాలతో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తరువాత కాలనుగుణంగా విలక్షణ నటుడిగా మారారు. ఆహా నా పెళ్లంట, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు వంటి చిత్రాలు ఆయనకు ఎంత పేరు తీసుకుని వచ్చాయే, ఆ నలుగురు సినిమా కూడా అంతే పేరు తీసుకుని వచ్చింది. కాగా త్వరలో ఓనమాలు సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్న రాజేంద్ర ప్రసాద్ గురువారం జన్మదినం జరుపుకొంటున్నారు. రాజేంద్ర్ర్రప్రసాద్ 1956, జులై 19న నిమ్మకూరులో జన్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: