జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2018 వేడుక ముంబయిలో ఘనంగా జరిగింది. 2017 సంవత్సరానికి గాను 63వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానోత్సవాన్ని శనివారం రాత్రి (జనవరి 20) నిర్వహించారు. బాలీవుడ్‌ సినీ రంగానికి చెందిన చిత్రాలు, నటులు ఇతర విభాగాలకు ఈ అవార్డులు అందజేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, ఆయన మిత్రుడు నిర్మాత కరణ్ జోహార్ ఆతిథ్యం నిర్వహించారు.
Film Fare
ఈ కార్యక్రమానికి ఎంతో మంది బాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, పలువురు పారిశ్రామిక వేత్తలు ఇతరులు హాజరయ్యారు.  ప్రముఖ బాలీవుడ్ నటుడు బాద్షా షారూక్ ఖాన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు..తన యాంకరింగ్ తో కార్యక్రమానికి విచ్చేసిన వారిని ఆనందింపజేశారు.  2017 సంవత్సరానికిగాను అందించిన ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘హిందీ మీడియం’  ఎంపికైంది. కాగా, ఉత్తమ నటుడు అవార్డును ఇర్ఫాన్ ఖాన్ అందుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా విద్యాబాలన్ నిలిచారు. 

Irrfan Khan and Vidya Balan were big winners at the Filmfare Awards.

ఉత్తమ విజేతలు వీరే  :
ఉత్తమ చిత్రం: హిందీ మీడియం
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): రాజ్‌కుమార్ రావు(ట్రాప్డ్)
ఉత్తమ నటి(క్రిటిక్స్): జైరా వసీమ్(సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ దర్శకుడు: అశ్విన్ అయ్యర్ తివారీ(బారెల్లీ కి బర్ఫీ)
ఉత్తమ సహాయ నటుడు: రాజ్‌కుమార్ రావు(బారెల్లీ కి బర్ఫీ)
ఉత్తమ సహాయ నటి: మెహర్ విజ్(సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ స్ర్కీన్‌ప్లే: సుభాషిస్ బుతియాని(ముక్తి భవన్)
ఉత్తమ కథ: అమిత్ న్యూటన్(న్యూటన్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్(జగ్గా జాసూస్)
ఉత్తమ గాయకుడు: ఆర్జిత్ సింగ్(రోకే నా రుకే నైనా- బద్రీనాథ్ కీ దుల్హానియా)
ఉత్తమ గాయని: మేఘనా మిశ్రా(నాచ్‌డీ ఫిరా- సీక్రెట్ సూపర్‌స్టార్)
ఉత్తమ గేయ రచయిత: అమితాబ్ బట్టాచార్య (ఉల్లు కా పత్తా- జగ్గా జాసూస్)
ఉత్తమ నేపధ్య సంగీతం: ప్రీతమ్(జగ్గా జాసూస్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సిర్సా రే(ఎ డెత్ ఇన్ ద గన్జ్)
బెస్ట్ ఎడిటింగ్: నితిన్ బైడ్(ట్రాప్డ్)
ఉత్తమ కొరియోగ్రాఫీ: విజయ్ గంగూలీ, ర్యూయెల్ దౌసన్ వరిన్దానీ(జగ్గా జాసూస్)



మరింత సమాచారం తెలుసుకోండి: