హీరోకు తగ్గట్టే సినిమా టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. అప్పుడే ఫ్యాన్స్ కు కిక్ ఎక్కుతుంది. అందుకే ఆచితూచి ఓ మంచి టైటిల్ కోసం పెద్ద కసరత్తులే చేస్తారు దర్శకనిర్మాతలు. తాజాగా మహేష్ కొత్త సినిమా విషయంలో టైటిల్ ఏం పెట్టాలనేది ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రానికి మొదట్లో 'ఆచార్య' అనుకున్నారు. ఇది మరీ సాఫ్ట్ గా వుందని వద్దనుకున్నారు. 'తుంటరి' టైటిల్ కూడా వినిపించింది. అయితే ఈ టైటిల్ పై చిత్ర నిర్మాత అనిల్ సుంకర తన ట్విట్టర్ స్పందించారు.
ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఇంకా ఫైనలైజ్ కాలేదని తెలిపారు. త్వరలోనే టైటిల్ ఖరారు చేస్తామని.. అధికారిక సమాచారం వెలువడే వరకు పుకార్లను నమ్మ వద్దని అనిల్ సుంకర కోరారు. 'ఆగడు' అనే టైటిల్ కూడా పరిశీలనలోకి వచ్చిందని తెలుస్తోంది.
ఇది కొంచం ఫోర్స్ తో ఉండడంతో, దీని పట్ల మొగ్గు చూపుతున్నారట. మొత్తానికి ఆఫీసియల్ గా ప్రకటించేవరకు మహేష్ సినిమా టైటిల్ సస్పెన్సే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి