అగ్ర రాజ్యంగా, ప్రపంచ దేశాలకి పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా పేరు చెప్పగానే అందరూ అనుకునేది అదొక భూతల స్వర్గం, లగ్జరీ జీవితాలు, వైట్ హౌస్, అధునాతన పరిజ్ఞానం. ఇలా ఎన్నో ఎన్నెన్నో ఊహల్లోకి వస్తాయి. అభివృద్ధి అనేది కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే కానీ మరొకవైపు ఉన్న ఆకలి కేకలు మాత్రం  బయటి ప్రపంచానికి తెలియవు. అమెరికాలోని ఎన్నో రాష్ట్రాలలో పేదలు ఆకలితో అలమటిస్తున్న సంఘటనలు ఇప్పటికీ ఉన్నాయంటూ ఓ సంస్థ చేసిన సర్వేలో బయటపడింది...

Image result for american <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POPULATION' target='_blank' title='people-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>people</a> suffering with hungry

నెక్స్ట్ జనరేషన్ ఫుడ్ సంస్థ నివేదికల ప్రకారం చూస్తే అమెరికాలో పరిస్థితులు ఎంతో దయనీయంగా ఉన్నాయని. ప్రపంచానికి కనిపించని ఎన్నో చేదు నిజాలు అక్కడ నెలకొన్నాయని తెలిపింది. అక్కడ పరిస్థితి ఎంతటి దీనస్థితిలో ఉందంటే అమెరికాలో 25 శాతం మంది పిల్లలు ఆకలి కేకలతో రాత్రిళ్ళు కాళీ కడుపుతో పడుకుంటున్నారట. సదరు సంస్థ లెక్కల ప్రకారం చూస్తే సుమారు 5 కోట్ల మంది ప్రజలు ఆకలితో ఒక పూట పస్తులు ఉంటున్నారని తెలిపింది.

 

అయితే అమెరికాలో పంటలు సరిగా పండక పోవడం సమస్యగా లేదు.  అమెరికా ప్రజల అవసరాలకంటే కూడా అధిక శాతం పంటల నిల్వలు ఉన్నాయి. కానీ వాటిని కొనుక్కుని తినే ఆర్ధిక స్థోమత మాత్రం వారికి లేదని సర్వేలో తేలింది. ప్రజలు తమ ఆకలి బాధలు తీర్చుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఫుడ్ బ్యాంక్ ల ముందు పడిగాపులు కాస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు సుమారు 40000 ఫుడ్ బ్యాంక్ లు ఏర్పడ్డాయి. ఇదిలాఉంటే గతంలో అంటే 1980 లో కేవలం 200 ఫుడ్ బ్యాంక్ లు మాత్రమే ఉండేవని ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా పెరిగిపోయిందని సర్వే తెలిపింది.

Image result for american poor <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POPULATION' target='_blank' title='people-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>people</a> hungry

లూసియానా , మిసిసిపీ , న్యూ మెక్సికో , అల్బమా , కెంటకీ , ఒక్లహామా , మైనీ, ఆర్ కాన్సాస్ వంటి నగరాలలో 17 శాతం మంది పజలు తీవ్ర ఆకలితో కొట్టుమిట్టాడుతున్నట్లుగా సర్వే తెలిపింది. సుమారు అమెరికా వ్యాప్తంగా 1.5 కోట్ల కుటుంభాలు ఆహార భద్రతా లేక ఆకలితో అలమటిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. అయితే ఎన్నో స్వచ్చంద సంస్థలు, వివిధ ప్రవైటు రంగ కంపెనీలు వారి సేవలలో భాగంగా వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారట...

 

మరింత సమాచారం తెలుసుకోండి: