ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 5000 దాటగా బాధితుల సంఖ్య 1,34,000గా ఉంది. కరోనా ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్కూళ్లు, థియేటర్లు మూతబడ్డాయి. చైనాలో కరోనా ప్రభావం కొంత తగ్గినా యూకె, ఇటలీ దేశాల్లో దీని ప్రభావం బాగా ఉంది. 
 
బ్రిటన్ లో ఇప్పటివరకు 798 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కరోనా ప్రభావంతో బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి ప్రభుత్వం మొదట మే 7వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుంది. కానీ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఎన్నికలను వాయిదా వేసింది. ప్రభుత్వ అధికారులు ఈసీ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. 
 
ఈసీ కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపరని భావిస్తోంది. అందువల్ల ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం తగ్గడానికి ఎన్నిరోజులు పడుతుందో అంచనా వేయలేం కాబట్టి వచ్చే ఏడాదికి ఎన్నికలు వాయిదా వేయనున్నట్లు ఈసీ ప్రకటన చేసింది. బ్రిటన్ లో ఒకే రోజులో 208 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం ఆ దేశంలో కలకలం రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: