తెలుగు భాష అంటే ఎంతో తియ్యగా ఉంటుంది. ఎంతో చక్కని నుడికారాలతో, పలుకులతో తేనే కంటే మధురంగా ఉంటుంది తెలుగు భాష  అంటారు కవులు,  తెలుగు భాషాభిమానులు.  అందుకే తెలుగు భాష కి ఎంతో మంది అభిమానులు ఉంటారు. దేశ భాష  లందు తెలుగు లెస్సా అని శ్రీ కృష్ణ దేవరాయలు ఊరికే అన్నారా. తెల్ల దొర అయిన బ్రౌన్ సైతం తెలుగు భాష ని కీర్తించిన విషయం అందరికి తెలిసిందే. అంతగా ఎంతో ప్రాచుర్యం పొంది, ఎంతో కీర్తించబడిన తెలుగు భాష ఇప్పుడు వివిధ దేశాలలో సైతం ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. మన తెలుగు భాష ను నేర్చుకోవాలని  ఎంతో మంది విదేశీయులు  తహతహలాడుతున్నారు.

IHG

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తమ పిల్లలు కూడా తెలుగు నేర్చుకోవాలని స్థానికంగా ఉండే ప్రవాస భారతీయుల తెలుగు పాటశాలలలో చేర్చుతున్నారు. ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేస్తూ తెలుగు భాష పై ప్రేమని పెంచుతున్నారు. ఇప్పటికే అమెరికా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది తెలుగు కుటుంభాలు స్థానికంగా ఉన్న తెలుగు పాటశాలలో తమ పిల్లలకి తర్ఫీదులు ఇప్పిస్తున్నారు. ఇదిలాఉంటే తాజాగా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది..

IHG

ఖండాంతరాలు వ్యాపించిన తెలుగు భాష ని గౌరవించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ బడులలో తెలుగు భాష ని ఐచ్చిక అంశంగా చేర్చుతూ తెలుగుకి గౌరవాని ఇచ్చింది. ఈ ఆదేశాలతో అక్కడి బడులలో ఒకటవ తరగతి నుంచీ పన్నెండవ తరగతి వరకూ ప్రాధమిక అలాగే మాధ్యమిక బడులలో తెలుగు భాష ని నేర్చుకునే అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ హిందీ, పంజాబీ తమిళ , భాష లకి మాత్రమే గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం ప్రకటించడంతో తెలుగు వారు, తెలుగు కవులు  ఉబ్బితబ్బిబవుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: