భారతదేశం నుంచీ ఎంతో మంది భారతీయులు అమెరికా విదేశాలలో పలు రంగాలలో స్థిరపడ్డారు. ఎంతో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్నతమైన స్థానాలలో ఉండటమే కాకుండా అమెరికాలో పలు కీలక రంగాలలో సేవలు అందిస్తూ భారతీయ అమెరికన్స్ గా గుర్తించబడి భారత్ ఖ్యాతిని పెంచుతున్నారు. తాజాగా ఇద్దరు భారతీయ అమెరికన్ వైద్యుల సేవలని గుర్తించిన అమెరికా ప్రఖ్యాత UCSF వారికి అవార్డులు ప్రకటించి గౌరవించుకుంది..పూర్తి వివరాలలోకి వెళ్తే..

 

అమెరికన్ సొసైటీ ఫర్ ఇన్వస్టిగేటివ్ ఫాధాలజీ (UCSF) 2021 కి గాను 6 మెరిటోరియాస్ అవార్డ్ గ్రహీతలను ప్రకటించగా అందులో డా. అబుల్ అబ్బాస్ , డా. జయంత దెబ్నాద్  అనే ఇద్దరు భారత సంతతికి చెందిన ఇండో అమెరికన్స్ ఈ గౌరవాన్ని పొందటం గమనార్హం.  అబ్దుల్ అబ్బాస్ UC శాన్ ఫ్రాన్సిస్కో డిపార్ట్మెంట్ ఫాదాలజీ లో ప్రొఫెసర్ మరియు చైర్ ఎమరటేస్ గా సేవలు అందిస్తున్నారు అంతేకాదు అబ్బాస్ కి గతంలో గోల్డ్ హేయాడెడ్ చనె అనే అవార్డ్ కూడా వరించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచీ డాక్టరేట్ చేసిన అబ్బాస్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుంచీ ఇంటర్న్ షిప్ అలాగే రెసిడెన్సీ లు కూడా చేశారు.

 

డా. జయంత్ UCSF ఫాధాలజీ విభాగంలో ప్రొఫెసర్ గ పనిచేస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి పై విశ్రుతమైన పరిశోధనలు చేశారు జయంత్. క్యాన్సర్ కణాల మనుగడ, పురోగతి పై చేసిన పరిశోధనలకు ఆయనకీ ఎంతో గుర్తింపు లభించింది.  కానికల్ ఆటోఫాగీ రెగ్యులేటర్లను ఆటోఫాగి కాకుండా జీవ ప్రక్రియలో ఎలా వస్తుంది అనే విషయంపై కూడా పరిశోధనలు చేశారు. హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ  నుంచీ డాక్టరేట్ పొందిన ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే పూర్తి చేశారు. అయితే ఇద్దరు భారతీయ వైద్యులకి ఈ అరుదైన అవార్డులు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని భారతీయ ఎన్నారై సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: