ఆంధ్రప్రదేశ్ లో గతంలో చంద్రబాబు నాయుడు సర్కార్ ఉన్న సమయంలో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులకు అండగా నిలబడుతూ ఉండేవారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని కొన్ని అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది అనే అభిప్రాయం చాలా వరకు కూడా ఉంది. సంక్షేమ కార్యక్రమాల విషయంలో దృష్టిపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని కీలక కార్యక్రమాల విషయంలో మాత్రం దృష్టి సారించలేకపోయింది అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమయింది.

కొన్ని కొన్ని అంశాలలో సీరియస్ గా ఉండాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంత సేపు కూడా తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్ళడమే గాని విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు చేయలేదు అనే భావన ఉంది. విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చేయడమే ఆని ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే వారి విషయంలో పెద్దగా దృష్టి సారించలేదు. దీని వలన సమస్యలు పెరుగుతూ వచ్చాయి. గతంలో కార్పొరేషన్ల ద్వారా చంద్రబాబు నాయుడు సర్కార్ కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులను విదేశాలకు పంపించింది.

దీంతో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించిన వారందరూ కూడా విదేశాల్లో చదువుకున్నారు. అంతేకాకుండా చేసుకున్న ఒప్పందాల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రాయితీలు కూడా వచ్చాయి. స్కాలర్ షిప్పులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి నిర్ణయాలు కనబడటంలేదు. విదేశాలకు వెళ్ళే వారి విషయంలో విదేశాల్లో ఉండి ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం లేదు. దీనితో విదేశాలకు వెళ్లాలి అని భావించిన వారు కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే భావన ఉంది.  ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈ విషయంలో ఆగ్రహంగా ఉందని కాపు కార్పొరేషన్ ద్వారా చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించారని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ దానిమీద దృష్టి సారించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: