ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది తప్ప ఎక్కడా తగ్గుముఖం  మాత్రం పట్టడం లేదు అనే చెప్పాలి. ఇక రష్యా తమ సేనలతో ఉక్రెయిన్ పై విరుచుకు పడుతోంది. జనావాసాల పై కూడా బాంబు దాడులకు పాల్పడుతూ అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే రష్యా సేనల దాడులలో ఎంతో మంది సాధారణ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి ఏర్పడింది అని చెప్పాలి  ఇక ఉక్రెయిన్ లో ఉన్న ప్రధాన నగరాల్లో భవనాలపై వరుసగా బాంబు దాడులు జరుగుతూ ఉండటం అందరినీ మరింత భయాందోళనకు గురి చేస్తోంది.


 ఏ క్షణంలో ఎటువైపు నుంచి బాబు వచ్చి మీద పడి పోతుందో అని ఉక్రెయిన్ లో ఉన్న ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా రోజు రోజుకు యుద్ధం తీవ్రతరం అవుతుంది నేపథ్యంలో ఉక్రెయిన్ లో  ఉన్న ప్రధాన నగరాలలో ఉన్న భవనాలపై కొన్ని మిస్టరీ గుర్తులు కనిపిస్తూ ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అవి రష్యా దాడులు చేసేందుకు పెడుతున్న టార్గెట్లు అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.  ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధికారులు అప్రమత్తమయ్యారు.


 ప్రధాన నగరాలలో ఉన్న ఎత్తైన భవనాల పై ఏమైనా మిస్టరీ గుర్తులు ఉన్నాయా అని కనిపెట్టే పనిలో నిమగ్నమై పోయారు. ఎక్కడైనా గుర్తులు కనిపిస్తే వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ఆరో రోజుకు చేరిన విషయం తెలిసిందే. అయితే రష్యా సేనలకు ఉక్రెయిన్ లో ఉన్న కొంతమంది సహకరిస్తున్నారని అనుమానాలు కూడా ప్రస్తుతం తెరమీదికి వస్తూ ఉండటం గమనార్హం. రాజధాని ప్రాంతమైన కీవ్ నగరంలో చాలా భవనాలపై ఎరుపురంగులో ఎక్స్ అనే గుర్తులు ఉన్నాయి. ఇది గమనించిన అధికారులు మిగతా ఏ భవనాలపై ఇలాంటి గుర్తులు ఉన్న అక్కడి నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అలాంటి గుర్తులు భవనాలపై కనిపిస్తే వెంటనే తెలియజేయాలి అంటూ అక్కడ ప్రజలకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: