భారత్ ను దెబ్బతీసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోని చైనా ఎలాంటి అవకాశాలు లేనప్పుడు కూడా ప్రత్యేకంగా కొన్ని అవకాశాలను సృష్టించుకొని భారత్ ను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భారత సరిహద్దు దేశాలు అన్నిటికీ కూడా ఆర్థిక సహాయం పేరుతో తమ వైపు తిప్పుకుని భారత్ ను దెబ్బతీసే విధంగా ఎన్నో కుట్రలు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నా చైనా ఎప్పుడూ దొడ్డి దారులు తొక్కుతూనే  ఉంటుంది.


 కొన్ని కొన్ని సార్లు చైనా అనుసరించే వ్యూహాలు పాటు ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమి ఏర్పడగా.. ఆ కూటమిలో నిప్పు పెట్టేందుకు సిద్ధమైంది చైనా.. అమెరికా జపాన్ భారత్ ఆస్ట్రేలియా దేశాలు చైనా పై పోరాటం చేసేందుకు క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఇటీవలే ఆస్ట్రేలియాలో కొత్త వ్యక్తి ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టారు అన్న విషయం తెలిసిందే.


 ఆంటోని ఆల్బనీష్  కొత్త ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యం  లో ఇక వివిధ దేశాల ప్రధాన మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఉండడం సర్వ సాధారణం గా జరుగుతూ ఉంటుంది. అయితే చైనా కూడా ఆంటోని ఆల్బనీష్ కు శుభాకాంక్షలు తెలిపింది.  అదే సమయం లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి. కొత్త ప్రధాని ఆస్ట్రేలియా అసలైన సార్వ భౌమత్వాన్ని కాపాడాలి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. దీన్ని బట్టి క్వాడ్ కూటమి నుంచి బయటకు వచ్చి తమతోపాటు కలిసి నడవాలని ఇండైరెక్ట్ గా సూచించింది చైనా అని విశ్లేషకులు అంటున్నారు. కమ్యూనిస్టు భావజాలంతో ఉండే ఆస్ట్రేలియా కొత్త ప్రధాన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: