ఇటీవల కాలంలో ఎంతోమంది పిల్లలు టీవీలకు బానిసలుగా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే టీవీ లేదంటే మొబైల్ చూడటం లాంటివి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడైతే పిల్లలు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు తల్లిదండ్రులకు చెప్పకుండానే బయటికి వెళ్లి ఇక స్నేహితులతో కలిసి మైదానంలో ఆడుకోవడం లాంటివి చేసేవారు ఇక ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో పిల్లలు మాత్రం స్కూల్ నుంచి వచ్చారు అంటే చాలు ఇక మొబైల్ చేతిలో ఉండాల్సిందే. ఒకవేళ మొబైల్ లేకపోతే ఇక ఏదో ఒకటి కార్టూన్స్ పెట్టుకొని టీవీ చూడటం లాంటివి చేస్తూ ఉన్నారు.


 ఇక ప్రస్తుతం టీవీలోనే అన్ని రకాల ఫీచర్స్  అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో టీవీకి ఎంతో మంది చిన్నారులు బానిసగా మారిపోతూ గంటల తరబడి టీవీ ముందు కూర్చుంటున్నారు అని చెప్పాలి. తద్వారా ఇక వారి ఆరోగ్యం దెబ్బ తినడమే కాదు చదువు అటకెక్కుతుంది. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోని ఇక అతిగా టీవీ చూస్తూ బానిసగా మారిన కొడుకులో మార్పు తెచ్చేందుకు ఇక్కడ తల్లిదండ్రులు ఒక వినూత్నమైన ఆలోచన చేసి సక్సెస్ అయ్యారు.


 ఇక ఎక్కువగా టీవీ చూస్తున్న కొడుకుని ఎన్నిసార్లు మందలించినా అతని తీరు లో మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలోనే అతనికి ఒక వింతైన శిక్ష వేశారు తల్లిదండ్రులు. స్కూల్ నుంచి రాగానే టీవీకి అతుక్కుపోయిన పిల్లాడిని ఇక రాత్రంతా పడుకోకుండా టీవీ చూడాలని శిక్ష వేశారు. అతను పడుకున్న మళ్లీ నిద్రలేపి మరీ టీవీ చూపించారు. దీంతో మళ్లీ టీవీ చూడను బాబోయ్ నన్ను వదిలేయండి అంటూ తల్లిదండ్రులను వేడుకున్నాడు సదరు చిన్నారి. ఈ ఘటన చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri