
ఇక ఇలా రోడ్ల వెంట తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉండడం లేదా గుడిమెట్లపై కూర్చుని భిక్షుటన చేస్తూ ఉంటారు ఎంతోమంది. అయితే కాస్లి దేశంగా పిలుచుకునే యూఏఈ లో మాత్రం భిక్షాటన చేయడం అటు చట్టరిత్య నేరం అని చెప్పాలి. ఇక ఇలా నిబంధనలు ఎవరైనా ఉల్లంఘించి భిక్షాటన చేశారు అంటే ఇక వారికి ఊహించిన రీతిలో జరిమానా విధిస్తూ ఉంటుంది అక్కడి ప్రభుత్వం. అయితే రిజిస్టర్ ఆర్గనైజేషన్‌కు చెందిన పౌరులు మాత్రమే ఇక డొనేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పాలి.
అయితే యూఏఈ లో ఇలాంటి నిబంధన ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఇక్కడ మహిళా భిక్షాటన చేయడం ప్రారంభించింది. అయ్యో పాపం ఆ మహిళకు ఎంత కష్టం వచ్చిందో అని అనుకుంటున్నారు కదా.. ఆ మహిళ ఏకంగా కాస్లి కారులో వస్తూ అబూ దాబిలోని పలు మసీదుల వద్ద బిక్షాటన చేస్తూ ఉంది. దీంతో పోలీసులు నిగా పెట్టి చివరికి ఆమెను అరెస్టు చేసారు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం భిక్షాటన చేస్తూ దొరికిన వారికి ఐదు వేల ఎమిరేట్స్ అంటే భారత కరెన్సీ ప్రకారం 1.11 లక్షలు జరిమానా మూడు నెలలు జైలు శిక్ష కూడా విధిస్తారు.