ఎప్పుడు ఏ దేశ భూభాగాన్ని ఆక్రమించుకోవాలా అనే విషయం పైనే దృష్టి పెడుతూ ఇక ఆ దిశగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మాయదారి చైనా. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న భారత భూభాగం పై కూడా కన్ను వేసి ఏకంగా యుద్ధ పరిస్థితులను సరిహద్దుల్లో తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు పొరుగున ఉన్న తైవాన్ ను కూడా ఎన్నోసార్లు ఆక్రమించుకోవడానికి కాలు దువ్వింది. ఈ క్రమంలోనే చైనా, తైవాన్ సరిహద్దుల్లో ఇక గత కొన్ని నెలల నుంచి కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో తైవాన్కు మద్దతు లభించింది. దీంతో చైనా ఆటలు సాగలేదు.


 కానీ ఇక ఇప్పుడు బైడెన్ అధ్యక్షుడిగా మారిన తర్వాత మాత్రం అటు తైవాన్కు అమెరికా నుంచి అంతంత మాత్రమే మద్దతు ఉండడంతో ఇక చైనా ఆటలకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా పోయారు. దీంతో ఇక తైవాన్ సరిహద్దుల వద్ద చైనా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుంది అని చెప్పాలి. దీంతో చైనా ఎప్పుడూ తైవాన్ పై యుద్ధం ప్రకటిస్తుంది అన్నది కూడా తెలియని విధంగానే మారిపోయింది. అదే సమయంలో చైనా తో యుద్ధం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాం. కానీ చైనా ముందు తలవంచ డానికి మాత్రం తామసిద్దంగా లేము అంటూ చిన్న దేశమైన తైవాన్ తెగేసి చెబుతుంది అని చెప్పాలి.



 ఇకపోతే తైవాన్ పై యుద్ధం ప్రకటించేందుకు చైనా భారీగా యుద్దనౌకలు, జెట్ పైటర్లను కూడా ఆ దేశ సరిహద్దు ప్రాంతాల్లో మొహరించి ఒక అడుగు ముందుకేసింది అన్నది తెలుస్తుంది. ఇలా మొహరించడం యుద్ధానికి రిహార్సల్స్ అంటూ చైనా పేర్కొంది అని చెప్పాలి. దీంతో చైనా ప్రతీకార చర్యలకు దిగుతుందని తైవాన్ మండిపడుతుంది అని చెప్పాలి. ఇక అయితే ఇటీవల చైనా నుంచి తైవాన్ కు బెదిరింపులు తీవ్రం కావడంతో ఆ దేశ అధ్యక్షురాలు  అమెరికాతో సమావేశం అయింది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: