కాలం కలిసి రావాలి కాని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇదంతా ఒట్టి మాటలు అని కొంతమంది కొట్టి పారేసిన.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం అందరికీ ఇదే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వరకు ఆర్థిక కష్టాలు ఎదుర్కున్న ఎంతో మంది ఊహించని రీతిలో ఒక్క రాత్రిలో కోటీశ్వరులుగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు కావాలంటే ఏం కావాలి అంటే ఇంకేముంది.. లాటరీ తగలడమో లేదంటే ఎక్కడైనా డబ్బులు ఉన్న బ్యాగ్ దొరకడమో జరగాలి. అలా అయితేనే కోటీశ్వరుడు కావడం సాధ్యమవుతుంది అంటారు ఎవరైనా.


 కానీ ఇక్కడ మాత్రం కష్టపడినా కూడా సరిగ్గా తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు కావచ్చు అన్న విషయాన్ని ఇక్కడొక వ్యక్తి నిరూపించాడు. సాధారణంగా ఎంతో మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మత్స్యకారుల వలకు ఎప్పుడు రకరకాల చేపలు పడుతూ ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సార్లు మాత్రం అరుదైన చేపలు వలకు చిక్కి మత్స్యకారులకు అదృష్టం వరిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ పాకిస్తాన్ కు చెందిన మత్స్యకారుడు కూడా ఇలాగే అరుదైన చేపలు పట్టి ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారిపోయాడు.


 పాకిస్తాన్ కరాచీలో ఇబ్రహీం హైదర్ అనే మత్స్యకారుడుకి అదృష్టం కలిసి వచ్చింది. అతను ఇటీవల అరేబియా సముద్రంలో వేటకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే అతని వలకు అత్యంత ఆరుదైన గోల్డెన్ ఫిష్ లు చిక్కాయి. అయితే వీటిలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఈ చేపలలో ఉండే దారం లాంటి పదార్థాన్ని సర్జరీలలో ఉపయోగిస్తూ ఉంటారు. 20 నుంచి 40 కేజీల బరువు ఉండే ఒక్కో చేప వేలంలో 70 లక్షల రూపాయలు పలికింది. దీంతో అతని వలకు చిక్కిన మొత్తం చేపలను అమ్మగా.. అతనికి ఏకంగా ఒక రోజులోనే ఏడు కోట్ల రూపాయలు సంపాదించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: