కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సంతోషంగా ఉన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పన్నిన వ్యూహం, ఎత్తుగడల కారణంగానే కడపలో టీడీపీ విజయం సాధించిందని చంద్రబాబు మంత్రులతో ముచ్చటిస్తూ ప్రశంసించారు. ఈ విజయంతో బాబుకు గంటాపై ఎనలేని ప్రేమ కలిగిందంటే నమ్మక తప్పదు.


Image result for jagan ganta sreenivasa rao

అయితే వైకాపా కంచు కోటలో టీడీపీ పాగా వేసేలా శాయశక్తులా కృషి చేసిన గంటా ను రాబోయే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పై పోటీకి దింపితే ఎలా ఉంటుందని జగన్ సహచర మంత్రులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నిన్న వెలువడ్డ ఎమ్మెల్సీ ఫలితాలతో జగన్ పై ఆ ప్రాంత ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది గనుకే టీడీపీ కి ప్రజలు పట్టం కట్టారని భావించిన బాబు ఏకంగా జగన్ సీటుకే టెండర్ పెట్టారు.


Image result for jagan ganta sreenivasa rao

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి సీఎం చంద్రబాబు ను ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్ కు ఈ రకంగా బుద్ధి చెప్పాలనే బాబు ఈ వ్యూహాన్ని రచించారని ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది. మరి జగన్ ఇలాకా లో పాగా వేయడానికి గంటా సిద్ధంగా ఉన్నారా..? లేక ఒకవేళ అతి నమ్మకంతో పోటీ చేసి ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారా...? తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: