ఈ మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏది చేసినా ప్రజలకు సంతోషంగా., ప్రతిపక్ష నేతలకు కాస్త బాధగను అనిపిస్తుంది.. జగన్మోహన్ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన అతి కొద్ది కాలంలోనే ఎన్నో రకాల పధకాలను ప్రజలకు అందిస్తూ ఎన్నికల ముందు తానూ చేసిన వాగ్ధానాలు నెరవేర్చుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ప్రజలు సైతం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని స్వీకరిస్తున్నారనే చెప్పుకోవాలి. ఇదిలా వుంటే నేడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారని సమాచారం..

ఈ నెల 22న కూడా ఆయన ఢిల్లీలోనే ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.. సోమవారం ఉదయం 10.05 గంటలకు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరి దాదాపుగా నేటి మధ్యాహ్నం 2.05 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, సమస్యలపై ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని చర్చించనున్నారట.

సీఎం సోమవారం రాత్రికి ఢిల్లీలోనే బసచేస్తారు. 22వ తేదీ మ.3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి తిరిగి విశాఖపట్నం చేరుకోబోతున్నారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు జగన్మోహన్ హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వివాహా రిసెప్షన్ అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

ఏదీ ఏమైనా జగన్ మాత్రం రాష్ట్రం గురించి గట్టి శ్రద్ధే తీస్కుంటున్నారు.. బహుశా గతంలో తనకు పడిన మచ్చ తొలగించుకోవాలనే ప్రయత్నమేమో కానీ ప్రజల పాలిటి వరములా జగన్ మారాడని చెప్పుకోవాలి.. తప్పులు చేయని వారు లేరు కానీ సరిదిద్దుకోటమనేది ఇప్పుడు జగన్ చేస్తున్న పని...

మరింత సమాచారం తెలుసుకోండి: