జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మెల్లగా సినిమాలకు దూరం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్‌ కళ్యాణ్‌ తాజాగా తన పార్టీ జనసేనను బలోపేతం చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈయన ఎన్నికల్లో బీజేపీ, తెదేపా తరపున విసృత స్థాయిలో ప్రచారం నిర్వహించాడు. ఆ ప్రచారంకు మంచి ఫలితాలు కూడా వచ్చాయి. దాంతో ఎన్డీయే కూటమిలో పవన్‌ కూడా ఒక భాగస్వామి అని బీజేపీ ఆయన్ను గౌరవించింది. నిన్న జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో బాబుతో పాటు పవన్‌ కూడా హాజరై సందడి చేశాడు. మోడీ కూడా తన ప్రసంగంలో పవన్‌ పేరును ప్రస్థావించకుండా పవన్‌ను స్థుతించాడు. దాంతో పవన్‌కు మరింతగా పొలిటికల్‌ క్రేజ్‌ పెరిగింది. దాంతో ఇక తన పార్టీని బలోపేతం చేసి, బాబు, మోడీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తమ పార్టీ వంతు కృషి చేస్తుందని పవన్‌ ప్రకటించాడు. తాజాగా హస్తినలో మీడియాతో మాట్లాడిన పవన్‌ సినిమాలపై కూడా స్పందిచాడు. తనకు మొదటి నుండి కూడా సినిమాలు సెకండరీ అని, సమాజం కోసం ఏదో చేయాలి అనే తపన ఉండేది అని అన్నారు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి, సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పాలని భావిస్తున్నట్లు పవన్‌ ప్రకటించాడు. ఇప్పటికే పవన్‌ రెండు చిత్రాలు ‘దేవ దేవం భజే’, ‘గబ్బర్‌సింగ్‌`2’ చిత్రాలను ప్రారంభించాడు. మరో రెండు చిత్రాలకు కమిట్‌మెంట్‌ ఇచ్చాడు. పవన్‌ తను మాట ఇచ్చిన సినిమాల వరకు పూర్తి చేసి, ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది అని తెలుస్తోంది. గతంలో పవన్‌ సినిమాలకు గతంలో కేటాయించిన సమయంలో సగం కేటాయిస్తాను అని ప్రకటించిన విషయం తెల్సిందే. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పవన్‌ ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పడమే మంచిది అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ నుండి మరో నాలుగు లేక అయిదు సినిమాలు వచ్చే అవకాశం ఉంది అని, ఆ తర్వాత పవన్‌ను మళ్లీ వెండి తెరపై చూసే అవకాశం లేక పోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. పవన్‌ నిర్ణయంతో ఆయన అభిమానుల్లో నిరాశ కలుగుతోంది. కాని పవన్‌ సమాజంలో మార్పు కోసం పోరాడుతున్నందుకు సంతోషంగా ఉంది అని అభిమానులు సంతోషంను వ్యక్తం చేస్తున్నారు. పవన్‌తో పాటు ఆయన పార్టీకి కూడా అండదండలు అందిస్తాం అంటూ పవన్‌ అభిమానులు చెప్పుకొస్తున్నారు. 2019 ఎన్నికలు టార్గెట్‌గా పవన్‌ తన పార్టీని బలోపేతం చేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. అందుకే వచ్చే సంవత్సరంతో సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: