ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును  నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా త‌ప్పుబ‌ట్ట‌డంతో పాటు, ఈ ఆర్టిక‌ల్ ర‌ద్దు చేయ‌డం వ‌ల్లే చైనా దురాక్ర‌మ‌ణ మొద‌లుపెట్టింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ అధికరణాన్ని రద్దు చేయడాన్ని చైనా అంగీకరించలేదన్నారు. చైనా మద్దతుతో మళ్ళీ ఈ ఆర్టికల్ ని పునరుధ్దరించే అవకాశాలు ఉన్నాయన్నారు. అంటే తమ పార్టీ ఈ విషయంలో ఆ దేశ సపోర్టును కోరుతోందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. లడాఖ్ లో వాళ్ళు (చైనా) చేస్తున్నదంతా ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలోనే ! వాళ్లకు కేంద్రం ఇలా చేయడం ఇష్టం లేదు ‘ అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. త‌న నిర్ణ‌యాలు, వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే ఫ‌రూక్ అబ్దుల్లా గ‌త ఏడు నెల‌లుగా గృహ‌నిర్బంధంలో కొన‌సాగిన విష‌యం తెలిసిందే.



ఇటీవ‌ల ఆయ‌న గృహ‌నిర్బంధం వీడారు. ఏడు నెలల పాటు గృహనిర్భందం తరువాత గత నెలలో విడుదలైన ఫరూక్ అబ్దుల్లా పలు జాతీయ వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్లా పైవిధంగా మాట్లాడ‌టం ఇప్పుడు ఆయ‌న‌పై సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. భార‌త్‌కు వెన్నుపోటుదారులుగా ఆయ‌న్ను కొంత‌మంది ముస్లింలు అభివ‌ర్ణిస్తున్నారు.  చైనా మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందన్న నమ్మకం ఉందని కూడా అబ్దుల్లా వ్యాఖ్యానించారు. నిజానికి భారత్ వ్యవహారంలోకి చైనాను ఆహ్వానించింది ప్రధాని మోదీనే అని అన్నారు.



 చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఇండియాకు పిలిచి, ఊయల ఊగింది, కలిసి భోజనం చేసింది మోదీనే అని అబ్దుల్లా గుర్తుచేశారు.తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసే భారత్ లో ఉండేకంటే, చైనీయులుగా జీవించాలని కాశ్మీరీలు కోరుకుంటున్నారంటూ గతంలో బాంబు పేల్చిన ఆయన... తాజాగా చైనా మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఆర్టికల్‌ 370 రద్దును కశ్మీరీలుగానీ, చైనాగానీ ఏనాడూ ఆమోదించలేదని, గత ఒప్పందాలకు విరుద్ధంగా కేంద్రం ఆర్టికల్ 370ని తొలగించింది కాబట్టే, దానికి వ్యతిరేకంగా సరిహద్దులో చైనా చర్యలకు దిగుతోందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: