జి హెచ్ ఎంసి లో అత్యధికంగా హయత్ నగర్ లో 28 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయిందని అధికారులు పేర్కొన్నారు. సరూర్ నగర్ లో 26.3 సెంటి మీటర్లు, ఉప్పల్ 25.8, ముషీరాబాద్ 24.5  సెంటి మీటర్ల వర్షపాతం నమోదు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని మూసీ కి విడుదల చేస్తున్నారు జలమండలి అధికారులు. హిమయత్‌ సాగర్ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షపాతం కారణంగా జలాశయానికి మరోసారి వరద 16666 క్యూసెక్యుల వరద  వచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం హిమయత్‌ సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 1762.867 అడుగులకు చేరుకుంది. దీంతో ఈ రాత్రి 12 గంటలకు  హిమయత్‌సాగర్ రిజర్వాయర్ 2 గేట్లను 2అడుగుల పైకి ఎత్తి 1375 క్యూసెక్కుల నీరును మూసీ కి విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు. ఇన్ ఫ్లో బట్టి మొత్తం 17 గేట్ల్ లలో ఈ రెండు గేట్లతో పాటు మరిన్ని గేట్లు లిఫ్ట్  చేయనున్నారు అధికారులు. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో మొత్తంగా 16666 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. 2 గేట్ల ద్వారా 1375 క్యూసెక్కుల నీరును మూసీ కి విడుదల చేస్తున్నట్టు వివరించారు.

హిమాయత్ సాగర్  పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 2.766 టీఎంసీలుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1763.867 అడుగులుగా  ఉందని తెలుస్తుంది. జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో.. జ‌ల‌మండ‌లి ఎండీ దాన కిషోర్ సంబంధిత... అధికారులు, హైద‌రాబాద్ మ‌రియు రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అసలు బయటకు రావొద్దు అని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: