తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, నిజామాబాద్ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవిత మరో సారి వివాదంలో నిలిచారు.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఆమె తన ఓటుహక్కుని వినియోగించుకున్న కారణంగా ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కినట్లు అయ్యింది.. గతంలో కూడా కవిత ఎన్నో సార్లు వివాదంలోకి లాగబడ్డారు. ఎమ్మెల్సీ అయిన తరువాత ఎక్కడ ఆమెకు మంత్రి పదవి ఇస్తారో అని ప్రతిపక్షాలు నానాహంగామా చేశాయి.. నేరుగా కేసీఆర్ ని ఎదురించే ధైర్యం లేక కవిత పై విమర్శలు చేయడం నచ్చడం లేదని తెరాస నేతలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు చేశారు..

అయితే అవన్నీ ఏమీ పట్టించుకోకుండా మళ్ళీ కేసీఆర్ కూతురు ను టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. నిజామాబాద్ బోధన్ నియోజకవర్గం లో ఆమెకు ఓటుహక్కు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ్నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే.. గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆమె ఓటు వేయడంతో వివాదం ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ నేతలు.. ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ ఎన్నికల సంఘం వరకూ వెళ్తున్నారు. ఎమ్మెల్సీ కవితపై అనర్హత వేటు వేయాలని సీఈసీకి తెలంగాణ బీజేపీ అధికారికంగా లేఖ పంపింది.

ఏదేమైనా రెండు చోట్ల ఓటుహక్కు ను వినియోగించుకోవడం కవిత ని చిక్కుల్లో పడేసేలా ఉందని చెప్పొచ్చు. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. హైదరాబాద్‌లో కవితకు ఓటు హక్కు ఉందన్న రికార్డుల్ని కూడా.. ఫిర్యాదుతో పాటు సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై స్పందించే అవకాశం లేదు. సీఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది కాబట్టి.. అక్కడ్నుంచి ఏమైనా స్పందన వస్తుందేమో చూడాలి. నిజానికి చాలా మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటుంది. కానీ ఒకటో వినియోగించుకుంటే ఇంకో చోట వినియోగించుకోరు. గతంలో కేసీఆర్‌ కు కూడా రెండు చోట్ల ఓటు ఉన్న విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: