పోర్న్‌ ఇండస్ట్రీ.. ఇప్పుడు అందరి చేతులకూ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ పరిశ్రమ ఒక్కసారిగా ఊపందుకుంది. అప్పటి వరకూ కంప్యూటర్లకే పరిమితమైన ఈ పోర్న్ వాచ్ .. స్మార్ట్‌ ఫోన్ల పుణ్యమా అని ప్రతి ఒక్కరికీ చేరువైంది. స్మార్ట్‌ఫోన్లు, డాటా అందుబాటులోకి వచ్చాక ఈ పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ వేగంగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పోర్న్ ఇండస్ట్రీ విలువ ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. అవును మరి.. ఇంటర్‌నెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా పోర్న్‌ ఇండస్ట్రీ విలువ అక్షరాలా 6లక్షల 70వేల కోట్ల రూపాయలట.


పోర్నోగ్రఫీ అంతా ఇంటర్‌నెట్ బేస్డ్‌గానే జరుగుతుంది కాబట్టి.. డేటా సేకరించడం కూడా సులభమే..  ఓ సర్వే ప్రకారం ఈ పోర్న్ ఇండస్ట్రీలో ఒక్క అమెరికాకే దాదాపు పదో వంతు భాగం ఉందట. మరి ఈ ఆరు లక్షల కోట్ల వ్యాపారం ఎలా జరుగుతుంది.. అందులో ఎవరి వాటా ఎంత.. అని లెక్కలు తీస్తే.. కేవలం గ్లోబల్‌ పోర్న్‌ వెబ్‌సైట్స్‌ ద్వారానే 2.80 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందట. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 28,258 మంది పోర్న్‌ చూస్తున్నారట.


ఇక మనదేశానికి వస్తే.. నీలిచిత్రాలను ఫోన్లలో చూసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పోర్న్ పరిశ్రమలో భారత్‌ వినియోగదారులే 89 శాతం ఉంటున్నారంటే.. ఈ జోరు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ, డేటా కారణంగా పోర్న్‌ చూసే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రోజూ ఇంటర్‌నెట్‌లో ప్రపంచ వ్యాప్తంగా అశ్లీల వీడియోల కోసం దాదాపు 7 కోట్ల మంది వెదుకుతున్నారట.


అంతే కాదు.. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్లలో వాడే డేటాలో మూడో వంతు ఈ బూతు చిత్రాలు చూసేందుకే వినియోగిస్తున్నారట. చౌకధరకు స్మార్ట్‌ ఫోన్లు, పెరిగిన నెట్ స్పీట్ కారణంగా పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లను  ఇప్పుడు అరచేతి నుంచే చూస్తున్నారు.  నీలిచిత్రాలను 89 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలోనే చూస్తున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: