రాజకీయాల్లో అదృష్టం కలిసిరాకపోతే ఎలాంటి నాయకుడుకైన గెలుపు అంతా త్వరగా రాదనే చెప్పొచ్చు. నాయకులకు కష్టంతో పాటు కాస్త అదృష్టం ఉంటేనే గెలుపు దక్కుతుంది. కానీ రాజకీయాల్లో ఎన్ని సార్లు కష్టపడినా అదృష్టం కలిసిరాక వరుసగా ఓటమి పాలవుతున్న నాయకుల్లో టి‌డి‌పి సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు.

అదృష్టం, దురదృష్టమో తెలియదు గానీ...ముందే వరుసగా రెండుసార్లు గెలిచేసి సోమిరెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. 1994, 1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి టి‌డి‌పి తరుపున గెలిచారు. ఆ తర్వాత నుంచి సోమిరెడ్డికి సర్వేపల్లిలో ఇంతవరకు గెలుపు దక్కలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఊహించని విధంగా నాలుగుసార్లు ఓటమి పాలయ్యారు. అలాగే మధ్యలో 2012 కొవ్వూరు ఉపఎన్నికలో కూడా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే 2014లో ఓటమి పాలైన కూడా టి‌డి‌పి అధికారంలోకి రావడంతో చంద్రబాబు, సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీంతో సోమిరెడ్డి చాలావరకు సర్వేపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. కానీ జగన్ గాలిలో సోమిరెడ్డికి మరొకసారి ఓటమి వచ్చింది. ఇన్నిసార్లు ఓడిపోయినా సరే సోమిరెడ్డి సర్వేపల్లిని వదిలిపెట్టలేదు. అక్కడే పనిచేస్తూ, నియోజకవర్గంలో టి‌డి‌పిని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నారు.

అధికార వైసీపీపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి ధీటుగా నిలబడేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పైగా మరొకసారి ఓటమి పాలైతే సోమిరెడ్డి రాజకీయ భవిష్యత్‌కే ఇబ్బంది ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఐదో ఛాన్స్‌లో సర్వేపల్లిలో గెలిచి చూపించాలని సోమిరెడ్డి ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే సర్వేపల్లిలో కాస్త వైసీపీదే పైచేయిగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికలనాటికి సర్వేపల్లిలో రాజకీయాలు ఎలా మారుతాయో...సోమిరెడ్డి ఈ సారైనా గెలుస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp