ఒక‌టి కాదు రెండు కాదు
ప‌క్క‌దోవ‌లో 40 ట్రాక్ట‌ర్లు
ఇసుక లోడ్ చేసి అన్ లోడెడ్ వెర్ష‌న్ లో వెళ్తున్నాయి
క‌ర్నూలులో ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సై ప‌ట్టుకున్నారు
వాటిని స్టేష‌న్ కు త‌ర‌లించాక ఆయ‌న‌కు విస్తుబోయే మాట‌లు
వినిపించాయి........

ప‌ట్టుకున్న ఇసుక ట్రాక్ట‌ర్లు వ‌దిలేయ్..ఇది మంత్రి వాయిస్ .. మీరు చ‌దివింది నిజ‌మే..కానీ ఇల్లీగ‌ల్ అయితే నేనెలా వ‌దులుతాను అని పోలీసు రిప్లై ఇవ్వాలి..ఆయ‌న కూడా దాదాపు ఇదే మాట కొంచెం సున్నితంగా తాను ప‌ట్టుకున్న 40 ట్రాక్ట‌ర్లూ ఇల్లీగ‌ల్ వ్య‌వ హారాల‌కు చెందిన‌వేన‌ని అన్నారు. అంతే! మంత్రి సీరియ‌స్ అయ్యారు. నీవు చూసీ చూడ‌నట్లు వ‌దిలేయ్.. కానీ అన్నింటినీ ప‌ట్టిం చుకోకు నా జ‌నం కావాల నా సేఫ్టీ కావాలా.. వ‌చ్చేసారి పోటీ చేసేదీ నేనే అని కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం ఫైర్ అ య్యారు. వాస్త‌వానికి ఇసుక అక్ర‌మ ర‌వాణా అన్న‌ది లేనే లేద‌ని వైసీపీ చెబుతోంది. ఇసుక ర‌వాణాపై తాము ఎన్నో నిబంధ‌న‌లు తీసుకున్నామ‌ని కూడా  కొన్ని ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌రించింది. అదేవిధంగా వైసీపీ ఆన్ లైన్ విధానం ఒక‌టి తీసుకువ‌చ్చి, ర్యాంపుల వ‌ద్ద ఇసుక త‌ర‌లింపు అన్న‌ది  అంతా పార‌ద‌ర్శ‌క‌మే అని కూడా చెప్పింది. కానీ ఇవ‌న్నీ కాద‌ని లేబ‌ర్  మినిస్ట‌ర్ త‌న‌దైన కోపంతో ఊగిపోయారు. ఓ ఎస్సైపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు. క‌ర్నూలు జిల్లాకు చెందిన సంబంధిత మంత్రి నిర్వాకం సామాజిక మాధ్య మాల్లోనూ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయ్, లేకపోతే ధర్నాకు దిగుతా అని హెచ్చ‌రించారు కూడా! ఇసుక రవాణాను చూస్తే పట్టుకోండి లేకపోతే వదిలేయండని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం హుకుం జారీ చేయ‌డం  ఈ టోట‌ల్ ఎపిసోడ్ లో మ‌రో ట్విస్టు. దీనిపై సీఎం ఏ విధంగా స్పందిస్తారో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కం. మంత్రి మాట‌లు సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్ గా మార‌డంతో ఎటువంటి యాక్ష‌న్, రియాక్ష‌న్ ఉంటాయో అన్న‌వి కూడా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కీల‌కం.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap