5 అంశాల పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ కి తెలంగాణా సిఎం కేసీఆర్ లేఖ ఇచ్చారు. నిన్న సాయంత్రం సిఎం కేసీఆర్ ఆయనతో భేటీ అయ్యారు. గోదావరి నదీ బేసిన్ లో తెలంగాణ ఏర్పడక ముందే ప్రారంభించిన 11.ప్రాజెక్టులను కేంద్రం జారీ చేసిన గెజిటి నోటిఫికేషన్ లో అనుమతి లేనివిగా పేర్కొన్నారని కేసీఆర్ అభ్యంతరం తెలిపారు. రాష్టానికి కేటాయించిన 967.94 టి.ఎంసీల నీటి పరిధిలోనే ప్రాజెక్టులు ఉన్నాయని అందులో 758.76 టిఎంసీల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులను కేంద్ర జలసంఘం ఇప్పటికే క్లియర్ చేసిందని లేఖలో కేసీఆర్ తెలిపారు.

మరో 148.82 టీఎంసీల సంబంధించిన నీటి లభ్యత పై హైడ్రోలజీ  డైరెక్టరేట్ క్లియర్ చేసిందని లేఖలో పేర్కొన్న సీఎం... తెలంగాణ ఏర్పడిన తర్వాత 70 టీఎంసీల కేటాయింపులతో  సీతారామ ప్రాజెక్టు,60 టీఎంసీల తో దేవాదుల ,45 టీఎంసీల తో ముఖ్తేశ్వర్ ఎత్తిపోతల పధకం అలాగే 3 టీఎంసీల తో రామప్ప, పాకాల లింక్ ,మొడికుంట సంబంధించిన డిపిఆర్ లకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞపి చేసారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ కొత్త ప్రాజెక్ట్ కాదు అని లేఖలో కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి రోజుకు ఒక టిఎంసి అదనంగా తీసుకోకపోవడం...

అదనపు ప్రాజెక్ట్ లేదా  కొత్త ప్రాజెక్ట్ కాదని  కేంద్రమంత్రి దృష్టికి కేసీఆర్ తీసుకువెళ్ళారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర జలసంఘం చేసిన 240  టీఎంసీల నీటి కేటాయింపులను వినియోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే అదనపు టీఎంసిని తొడుకునే పనులు చేపడుతున్నాము అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అసలు అవసరం లేదన్నారు. చిన్న నీటి పారుదల పధకమైన కందుకుర్తి ఎత్తిపోతల పధకం 3300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నది అని దీనికి అనుమతులు అవసరం లేదని చెప్పారు.  

రామప్ప పాకాల  లింక్, తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల ఎత్తిపోతల పథకం లో భాగం కాబట్టి కొత్తగా అనుమతి అవసరం లేదు అని వివరించారు. కంతనపల్లి ప్రాజెక్టు ను కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తీసివేయాలి అని కేసీఆర్ కేంద్ర మంత్రికి వివరించారు. గోదావరి నది యాజమాన్య బోర్డు కేంద్ర జల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts