జగన్ మంత్రివర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు 50 శాతం మంత్రివర్గాన్ని మార్చే అవకాశం ఉందని...కాదు కాదు 80 శాతం వరకు మార్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. జగన్..100 శాతం మంత్రివర్గాన్ని మార్చేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పేశారు. తనతో జగన్ చెప్పారని త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరగనున్నాయని అన్నారు.

అంటే సి‌ఎం జగన్ మొదట్లో చెప్పిన విధంగా రెండున్నర ఏళ్లు కావొస్తుంది...డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గంలో మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడున్న మంత్రులందరూ సైడ్ అయిపోతారని తెలుస్తోంది. కాకపోతే ఇద్దరు మంత్రులు ఏడాది క్రితమే క్యాబినెట్‌లోకి వచ్చారు. మండలి రద్దు నేపథ్యంలో పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వారికి జగన్ రాజ్యసభ పదవులు ఇచ్చారు. ఇక ఆ ఇద్దరి ప్లేస్‌లో అదే వర్గానికి చెందిన మరొక ఇద్దరినీ క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. శెట్టిబలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాస్ ప్లేస్‌లో చెల్లుబోయిన వేణుగోపాల్, మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి ప్లేస్‌లో సీదిరి అప్పలరాజులని క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. గత ఏడాది జూలైలో ఈ ఇద్దరు మంత్రివర్గంలోకి వచ్చారు. అయితే నెక్స్ట్ జరగబోయే మంత్రివర్గ మార్పుల్లో ఈ ఇద్దరు కూడా ఔట్ అవుతారని తెలుస్తోంది. ఏడాదిన్నరకే ఈ ఇద్దరు క్యాబినెట్ నుచి బయటకు వచ్చేయనున్నారు.

ఇక వీరి ప్లేస్‌లో పదవులు కొట్టేయడానికి పలువురు ఎమ్మెల్యేలు కాచుకుని కూర్చున్నారు. చెల్లుబోయిన ప్లేస్‌లో క్యాబినెట్‌లో రావడానికి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రయత్నిస్తున్నారు. శెట్టిబలిజ/ గౌడ కోటాలో పదవి కొట్టేయాలని చూస్తున్నారు. అటు జోగికి పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ పోటీ ఇస్తున్నారు. ఇక సీదిరి అప్పలరాజు స్థానంలో మత్స్యకార వర్గానికి చెందిన ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ క్యాబినెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి కొత్త మంత్రులు కూడా ఔట్ అయ్యేలా ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: