చట్టాలను రాజకీయనేతలు ఇష్టానికి వాడేసుకోవడం ఎప్పటి నుండో ఉంది. అయితే దానిపై భారత న్యాయస్థానం ఒక స్పష్టత ఇచ్చింది. దేశద్రోహం సెక్షన్ ను కూడా రాజకీయాల కోసం వాడుకోవడం బాగా ఎక్కువ అయ్యిందని భావించడం వలన న్యాయస్థానం దానిని పూర్తిగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా చేయడం వలన రాబోయే రోజులలో నష్టం వాటిల్లుతుందా లేక ప్రయోజనమే ఉండనుందా అనేది కూడా ఇక్కడ పరిగణ లోకి తీసుకోవాలి. ఈ సెక్షన్ పూర్తిగా తీసేయడం వలన దేశద్రోహులు పెట్రేగిపోయే అవకాశాలు ఉన్నాయన్నది మరో వర్గం వాదన. అది కూడా నిజమే, చట్టం ఉన్నప్పుడు దానిలో లోపాలను వాడుకుని గట్టెకేసిన వారు, అసలు అలాంటి చట్టమే లేకపోతే ఇంకెంత ఘోరంగా నేరాలు చేస్తారు అనే అంశం కూడా పరిశీలించ వలసి ఉంటుంది.

సెడేషన్ చట్టం పై ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల ను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం కూడా 124ఏ పై పూర్తిగా సమాలోచించి, దానిని ఎక్కువ దుర్వినియోగం చేయడానికే ఉపయోగిస్తున్నారు అనే అభిప్రాయానికి వచ్చింది. దీనితో చీఫ్ జస్టిస్ కూడా ఈ చట్టం రద్దు అవసరం అనే దానిపై వివిధ వర్గాల ద్వారా వచ్చిన అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకోని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇక తీవ్రవాదులకు లేదా దేశీయ ఉగ్రవాదులు కూడా ఆయా పత్రిక లలో పని చేస్తున్నట్టు దొంగ గుర్తింపు పత్రాలు పట్టుకొని దేశ భద్రతకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నప్పుడు ఏ కేసు కింద వారిని ఖైదు చేయాలనేది ఇక్కడ ప్రశ్న బయలుదేరుతుంది.

దేశద్రోహం చట్టాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు వ్యాజ్యాలు వచ్చిన మాట పరిగణలోకి తీసుకోవచ్చు కానీ అవన్నీ వేసిన వారు నిజంగా భారతదేశ ప్రయోజనాలను ఆశించి వేశారా లేక తలాతోకా లేని వాళ్ళు వేసిన వ్యాజ్యాలను కూడా పట్టించుకోని ఒక చట్టాన్ని రద్దు చేస్తే, రేపటి రోజున దేశద్రోహులతో దేశంలో పెను ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఎలా అడ్డుకోవాలనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చట్టాలు రద్దు చేయడం, తీసుకురావడం గొప్పేమి కాదు, వాటిని అమలు చేసేప్పుడు దానిలో లోపాలను వాడుకునే వాళ్లలో ఎలాగూ మార్పు రానప్పుడు మరింత కఠినంగా దానిని రూపొందించాలి తప్ప రద్దు దిశగా నిర్ణయాలు ఎంతవరకు సమంజసం. ప్రతిదానిపై నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు, చట్టాలను దుర్వినియోగం చేసే వారిపై కూడా ఒక కన్ను వేసి తద్వారా చట్టాలకు బలాన్ని చేకూర్చవచ్చేమో చూడండి!

మరింత సమాచారం తెలుసుకోండి: