ఇటీవలే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక ఈ విషయంపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ హాల్లో ఈ సమావేశం జరగబోతుంది.  ఇక ఈ కేబినెట్ సమావేశానికి మంత్రివర్గం మొత్తం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్ట పోతున్న 14 బిల్లులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.


 అయితే ఇప్పటికే 14 ఆర్డినెన్స్ లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు కేబినెట్ లో ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాసుబుక్ చట్ట చట్ట సవరణ లను ఆమోదించనునట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఏపీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ,ఏపీ ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మోనిటర్ కమిషన్ చట్ట సవరణకు కూడా ఆమోదం తెలపపోతున్నారట   ఇక ఏపీ విద్యుత్ చట్ట సవరణ.. సంబంధించిన బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తోంది.



 ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, ఏపీ చారిటబుల్ అండ్ హిందూ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్స్ చట్ట సవరణ, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడింగ్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మరియు ఫారిన్ లిక్కర్ చట్ట సవరణ, ఏపీ అసైన్డ్ ల్యాండ్ చట్ట సవరణ, ఏపీ బోవైన్ బ్రీడింగ్ చట్ట సవరణ, ఏపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ చట్ట సవరణ, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్లో చట్ట సవరణ, ఏపీ సినిమా నియంత్రణ చట్టసభలకు క్యాబినెట్ ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: