రాజకీయాలలో విమర్శలు,  ప్రతి విమర్శలు సహజం. ఒక్కోసారి ఇవి తారాస్థాయిని మించి పోతుంటాయి. మాటల తూటాలు పేలుతుంటాయి. సభలకు హాజరైన జనానికి జోష్ తెప్పించే ప్రయత్నంలో నాయుకులు తమను తాము వరచి పోతుంటారు. మైక్ చేతికంది తే చాలు.. రెచ్చి పోతుంటారు. అందరూ ప్రత్యర్థులపై కామన్ గా చేసే ఆరోపణ ఒక్కటే ఉంటుంది. అదే  భూ కబ్జా.. ఇటీవలి కాలంలో ఇద్దరు నేతలు భూకబ్బాల వ్యవహారంలో  మాటల తూటాలు పేల్చుకున్నారు.
ఇది దాదాపు నాలుగైదు నెలల నాటి ముచ్చట...తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...  ప్రజలకు పరిచయం అక్కర లేని వ్యక్తి. ఆయన ఒక వైపు,.. తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి మరో వైపు మాటల తూటాలు పేల్చుకున్నారు. రేవంత్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మాడు చింతపల్లి మండల కేంద్రంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డిపై విరుచుకు పడ్డారు. భూ కబ్జా దారుగా అభివర్ణించారు.  రాష్ట్ర మంత్రి టార్గెట్ గానే  రేవంత్ రెడ్డి ప్రసంగం సాగింది. జవహర్ నగర్  మున్సిపాలిటీ వేలాది ఎకారాల ప్రభుత్వ భూమి ఉందని రేవంత్ రెడ్డి పేర్కోంటూ మంత్రి మల్లా రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడ ఏ ఒక్కరి పేరు మీద కూడా గతం నుంచి వర్తమానం వరకూ ఏ ఒక్క గుంట భూమి కుడా రిజిస్టర్ కాలేదని పేర్కోంటూ,..మంత్రి 268 ఇంటి నంబర్ లో తప్పుడు పత్రాలు సృష్టించి, తన కోడలి పై రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపించారు. అంతే కాక అక్కడ ఆసుపత్రి కట్టించి , వైద్య వ్యాపారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సూరారం చెరువును ఆక్రమించారని, నీరు పారే తూములను మూసివేసి అక్కడ కూడా దవాఖానాలు కట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా మంత్రి మల్లా రెడ్డి అల్లుడు ఔటర్ రింగ్ రోడ్డు పక్కన చెరువును ఆక్రమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆక్రమించిన స్థలంలో ఇంజనీరింగ్ కళాశాలలు కట్టారని ఆరోపణలు చేశారు. మంత్రిని బ్రోకర్, జోకర్ అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి
మంత్రి మల్లా రెడ్డి కూడా తనదైన పౌరుషంతో తిరుగు సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. తాను పాలు అమ్మించి నిజమేనని పేర్కోంటూ..,.ఎంతో కష్టపడి ఉన్నత స్థితికి వచ్చానని చెప్పారు. రూపాయి రూపాయి కూడబెట్టి తాను సంపన్నుడనయ్యానని మల్లా రెడ్డి చెప్పుకొచ్చారు. నేను శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా.. నీవు నీ పార్లమెంట్ సభ్యత్వానికి , పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా ? అని సవాల్ విసిరారు.. దాదాపు వారం, పది రోజుల వరకూ వీరిద్దరి మాటల తూటాలకు ప్రసార మాధ్యమాలు వేదికైంది. సర్వసాధారణంగానే కాలం తో పాటు ఈ మాటల యుద్దం కూడా మరుగున పడింది. మంత్రి మల్లా రెడ్డి పై పడిన భూ కబ్జా మరక మాత్రం ఇంకా తొలగిపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: