ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి క్రికెటర్లు అలాగే సినిమా ప్రముఖులు రావడం అనేది కాస్త సంచలనంగా మారిన విషయం. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా సినీ ప్రముఖులు అలాగే క్రికెటర్లు రాజకీయాల మీద ఆసక్తి చూపిస్తున్నారు అనేది ఉత్తరాది రాష్ట్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ కు  చెందిన మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వినపడుతున్నాయి.

దీనికి సంబంధించి రాష్ట్ర పార్టీ నేతలతో కూడా ఆయన ఇప్పటికే చర్చలు జరిపారని ఆయనకు ఇచ్చే స్థానంపై కూడా స్పష్టత వచ్చిందని ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాలనే దానిమీద కసరత్తులు కూడా చేశారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయనను అన్ని విధాలుగా వాడుకునే విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందీ లేకపోయినా భవిష్యత్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ వ్యవహరిస్తోంది.

బిజెపి లో ఉన్న కొంతమంది కీలక నాయకులు కూడా ఉత్తరప్రదేశ్ మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్న పలువురు ప్రముఖులను తమ పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్పీ సింగ్ విషయంలో కాస్త సీరియస్ గా వ్యవహరించి ఆయనకు వచ్చే ఎన్నికల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే కీలక మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఆర్పి సింగ్ కూడా దీనికి అంగీకరించారని త్వరలోనే ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల ప్రచారం కూడా ఆయన గట్టిగానే చేసే అవకాశం ఉండవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: