తాలిబన్ లను ప్రపంచం గుర్తించడం అనే విషయం పక్కన పెట్టేసింది. కానీ వాళ్లకు ముందు నుండి మద్దతు ప్రకటిస్తున్న చైనా, పాక్ ల తీరులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అలాగని వాళ్ళ వ్యూహాలు నెరవేరలేదు కూడా. అయినా ఇంకా ఎదురుచూస్తున్నట్టే ఉన్నారు. పాక్ ఇప్పటికే తాలిబన్ మరో వర్గంతో అనేక ఇబ్బందులు పడుతూనే ఉంది. కాబుల్ విమానాశ్రయం వ్యవహారంలో కూడా పాక్ కు చుక్కెదురైంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ పాక్ తన తరహా మార్చుకోవట్లేదు. తెహ్రికి తాలిబన్ లు ఇప్పటికే పాక్ లో ని సరిహద్దులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పాక్ వ్యవహార శైలి నచ్చని ప్రజలు రోడ్లెక్కారు, వాళ్లతో విపక్షాలు కలిశాయి. తరువాత ఇదే అదును అనుకుని తెహ్రికి తాలిబన్ లు కూడా ఆ ఆందోళన కారులలో కలిసిపోయి, ఇమ్రాన్ కు వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ వస్తున్నారు.

ఆఫ్ఘన్ ఆక్రమణ తరువాత పరిస్థితి అంతా తమకు అనుకూలంగా ఉంటుంది అని చైనా, పాక్ ఆశించడం జరిగింది. కానీ వాళ్ళు పెట్టుకుంది ఉగ్రభూతాలతో అని, కాస్త జాగర్తగా ఉండాలని అప్పట్లో తోచినట్టుగా లేదు. అందుకే ఇప్పుడు వాళ్ళు చేయి దాటిపోయారు. పాక్, చైనా కు సహకరించకుండా, వీలైతే పాక్ ను కూడా ఆదీనంలోకి తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాక్ లో ప్రభుత్వం మారితే మటుకు దాదాపుగా ఆక్రమణ జరిగిపోయినట్టుగా భావించవచ్చు. ఇమ్రాన్ దానికి అడ్డుపడుతున్నాడు కాబట్టి అతడిని తప్పించి, తమకు అనుకూలమైన వాడిని అధినేతగా ఏర్పాటు చేసుకోవాలన్నది తెహ్రికి తాలిబన్ వ్యూహం.

ప్రస్తుతం ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసి)లో చేరాలని తాలిబన్ లు పాక్ ను కోరుతున్నారు. అంటే ఇక దాదాపుగా తాలిబన్ చేతిలోకి పాక్ వెళ్లినట్టుగానే భావించవచ్చు. ఈ నెల 19న దానికి సంబంధించి సమావేశాలు నిర్వహిస్తుంది తాలిబన్ ప్రభుత్వం. పాక్ సహా ఇతర ఇస్లామిక్ దేశాలు ఈ ఆహ్వానాన్ని మన్నిస్తాయా, తాలిబన్ సంస్థలో చేరతాయా అనేది ఆ సమావేశం అనంతరం తెలియనుంది. ఇప్పటికే పాక్ సహా ఇతర ఇస్లామిక్ దేశాలకు, అమెరికా, రష్యా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకులకు తాలిబన్ ప్రభుత్వం సమావేశాలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. పాక్ కూడా ఆయా దేశాలు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతుంది. ఇది భవిష్యత్తులో పాక్ కు పెను ముప్పు తెస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు వెలేసిన స్థితిలో పాక్ ఉంది, ఇప్పటికి ఇలాంటి పనులు చేస్తూ ఉంటె దాని భవిష్యత్తు ఇంకా సమస్యలలో పడుతుంది. అయితే తాలిబన్ దురాక్రమణలను ఇస్లాం దేశాలు కూడా ఆహ్వానించబోవని చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రస్తుత ఆహ్వానం పై కూడా ఇంకా ఏ దేశం కూడా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: