రాజకీయాలలో ఎప్పుడు ఎం జరుగుతుంతో ఎవరీ అంతబట్టని విషయం. ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడతాడు అనే విషయం కూడా  అంతు చిక్కని వ్యవహారం. ఆంధ్ర ప్రదేశ్  లో రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నేతలు ఒకే పాట పాడుతున్నారు...  సరికొత్త సంగీతాన్ని ఆలపిస్తున్నారు. ఎవరా నేతలు ? ఏమిటా పాట ?

 గుంటూరు జిల్లా అమరావతి గ్రామం పరిసరాలు, అక్కడి పోలీసులు అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ ను  అడ్డుకున్నారు,  సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్  పార్టీకి చెందిన స్థానిక నేతలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వీరంగం సృష్టించారు. తమ పార్టీకి చెందిన వ్యక్తి ట్రాక్టర్ ను ఎల్ సీజ్ చేస్తారంటూ తమదైన రీతిలో రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అధికార పార్టీ కార్యకర్తల్లో ఒకరు ఈ   ఘటనను తన సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఇంతకీ పోలీసులు కేసు నమోదు చేశారా ? లేదా ? అన్న విషయం కూడా స్పష్టత లేదు. ఇదంతా రెండుమూడు నెలల క్రిందటి  ముచ్చట.
అయితే ఈ వీడియో తాజాగా వాట్సప్ గ్రూపుల్లో  హల్ చల్ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇద్దరూ కూడా ఒకే రోజు  ఇసక మీద పాత పాటే పాడారు. వేర్వేరు వేదికల నుంచి మీడియాతో మాట్లాడారు.
 రాష్ట్రం లో మైనింగ్ అధికారుల బాధ్యతా రాహిత్యం పై సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి మాటలతూటాలు సంధించారు. రాష్ట్రంలో ఇసుక అమ్మకాలను  ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించిన తరువాత తమకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పడం ఎంత వరకు సబబు? అని ప్రశ్నంచారు. రాష్ట్రంలో  వివిధ ఇసుక రీచ్ లలో ఇసుక ధరల పై తాము సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు తెలుసుకున్నామని ఆయన పేర్కోన్నారు. ముఖ్యమంత్రి సొంతూరు పులివేందులలో ఇసుక టన్ను ధర 835 కే లభిస్తున్నదని, అదే మారో ప్రాంతంలో 1200 గా ఉందని, ఇంత వ్యత్యాసం ఏమిటని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికారులు మిన్నకుండిపోవడం ఏమిటని  ఆయన ప్రశ్నించారు.
దాదాపు ఇదే సమయంలో భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రాజమహేంద్ర వరంలో ఇసుక  అంశంపైనే  ప్రభుత్వం పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోందని ఆరోపించారు. ప్రభత్వం చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందన్నారాయన. ఆంధ్ర ప్రదేశ్ లో  ట్రాక్టర్ ఇసుక పద్దనిమిది వేల రూపాయలకు అమ్ముడవుతోందని వీర్రాజు పేర్కోన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో నేతలు  పాత ఇసుక పాటనే సరికొత్తగా పాడటం దేనికి సంకేతం ?


మరింత సమాచారం తెలుసుకోండి: