కొత్తగా రోడ్డు ప‌నులు చేప‌ట్టాలంటే ఉన్న‌ట్టుండి డ‌బ్బులు రావాలి లేదా ప్ర‌భుత్వం త‌ర‌ఫున చెల్లింపు చేయాల్సినంత చేయాలి..మొద‌టి విడ‌త రోడ్డు ప‌నుల‌కు సంక్రాంతి త‌రువాత ముహూర్తం అని చెప్పినా ఈ సారి అది కూడాలేద‌నే తేలిపోయింది.ఎందుకంటే ప్ర‌భుత్వం త‌ర‌ఫున చెల్లించాల్సిన మొత్తం (120కోట్లు) చెల్లించకుండా ఒక్క అడుగు కూడా వేయ‌లేం అని ఎన్డీబీ అనే ఓ సంస్థ,అదేవిధంగా కేంద్రం నిబంధ‌న‌లు తేల్చి చెబుతున్నాయి.రుణం తీసుకుని ప‌నులు చేయాల‌న్నా కూడా నిబంధ‌న‌లే అడ్డు ఉన్నాయి క‌నుక కేంద్రంపై ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక‌న‌మిక్ ఎఫైర్స్ పై జ‌గ‌న్ కోపం పెంచుకోవ‌డం మిన‌హా చేయ‌దగింది ఏమీ లేద‌ని కూడా తేలిపోయింది ఈవాళ...ఎన్డీబీ అంటే న్యూ డెవ‌ల‌ప్మెంట్ బ్యాంకు అని! ఈ బ్యాంకు రోడ్డు ప‌నుల‌కు రుణాలు ఇస్తామ‌ని ముందుకు వ‌చ్చి 70 శాతం రుణం ఇస్తామ‌ని అయితే 30 శాతం రాష్ట్రం చెల్లిస్తేనే ప‌నులు అవుతాయ‌ని నార్మ్స్ చెబుతున్నాయి.. అని ఇవాళ ప్ర‌ధాన మీడియా వెలుగులోకి తెచ్చింది.. మ‌రియు తేల్చింది..ఇప్పుడు ప‌నులు అవుతాయా?


డబ్బుల్లేకుండా ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు? డ‌బ్బులుంటే ఏం చేస్తార‌ని సంక్షేమం కు కొంత నిధులు ఇచ్చి త‌రువాత చేతులెత్తేయ‌డం గ్యారెంటీ. ఉన్న‌దంతా ఊడ్చి సంక్షేమానికి ఇవ్వడంతో జ‌గ‌న‌న్న పేద‌ల మ‌నిషి అని అనిపించుకుంటున్నారా అంటే అదీ లేదు. అక్క‌డా నానా అగ‌చాట్లూ ఉన్నాయి.అవ‌స్థ‌లు ఉన్నాయి.ప‌థ‌కాలు అప్ప‌టిలానే అంటే టీడీపీలానే కొంద‌రివే కొంద‌రికే అన్న రీతిలో అమ‌లు అవుతున్నాయి.అలాంట‌ప్పుడు స‌మ‌స్య ఎలా ప‌రిష్కారం అవుతుంద‌ని?

సంక్రాంతి త‌రువాత రోడ్లు బాగవుతాయ‌ని డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు చెప్పారు.సంక్రాంతి త‌రువాత నుంచి మే వ‌ర‌కూ రెండు ద‌శ‌ల‌లో రోడ్లు అభివృద్ధి చేసి చూపిస్తామ‌ని శ్రీ‌కాకుళం జిల్లా వైపీపీ అధ్య‌క్షులు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. ఈ రెండూ వేర్వేరుగా ఏం లేవు. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌ల వెనుక ఉన్న‌ది జ‌గ‌నే! కానీ నిధులున్నాయా అని మొన్న‌టి వేళ మీడియా ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తే జ‌గ‌న్ పార్టీ మాత్రం అందుకు సుముఖంగానే ఉన్నామ‌ని అంటోంది.కానీ వాస్త‌వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.న్యూడెవ‌ల‌ప్మెంట్ బ్యాంకు రుణంతో చేప‌ట్ట‌బోయే రోడ్లకు సంబంధించి నీలిమేఘాలు క‌మ్ముకున్నాయి. ఈ బ్యాంకు రుణం ఇస్తామ‌న్నా ప్ర‌భుత్వం చెల్లించాల్సిన వాటా చెల్లించ‌డం లేద‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది.దీంతో సంక్రాంతి త‌రువాత సింగిల్ లైన్ రోడ్లు డ‌బుల్ లైన్ రోడ్ల‌గా మారే అవ‌కాశ‌మే లేదు...అని తేలిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp