ఆంధ్ర్ ప్రదేశ్ లో ఉద్యోగులు తమ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్న వేళ.. సిఎం. కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారత్ కు చేందిన అంతర్జాతీయ ఉత్పత్తుల కంపెనీతో ఎం.ఓ.యు కుదుర్చుకుంది. ఫలితంగా ఆ కంపెనీ ఖాతాలోకి రాష్ట్రానికి చెందిన మరో జిల్లా చేరినట్లయింది.
సహకార డెయిరీ రంగంలో అంతర్జాతీయ కీర్తినార్జించిన 'అమూల్‌' సంస్థ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు ఇకపై ఏపీలోనే తయారైన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.అందులో భాగంగానే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం శుక్రవారం అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం చేసుకుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్‌ శ్రీకారం చుడుతోంది. ఇది మంచి పరిణామం. వ్యవసాయానికి పాడి రైతులు తోడైతేనే గిట్టుబాటు ధర లభిస్తుంది. అని పేర్కోన్నారు.  అమూల్‌ దేశంలోనే  ప్రథమ స్థానంలోఉన్న సంస్థ. ఇక నుంచి డెయిరీకి  పాలు పోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్‌కు యజమానులు. ఇప్పటికే ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కొనసాగుతోంది. కొత్తగా అనంతపురం జిల్లాలోనూ ప్రారంభిస్తున్నాం. అనంతపురం జిల్లాకు ఇదొక మంచి శుభవార్త. పాడి రైతుకు లీటర్‌కు రూ. 5-20వరకు అదనపు ఆదాయం  రానుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నాం. అమూల్‌ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మిగిలిన  ప్రైవేట్‌ కంపెనీలు కూడా రేటు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందిఅని ముఖ్యమంత్రి పేర్కోన్నారు.  పాల సేకరణలో జరిగే మోసాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా ఆయన తెలిపారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగంలోని పాల కేంద్రాలను ప్రైవేటు పరం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: