ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని డప్పు కొట్టుకునే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోరు పడిపోయినట్లుంది. మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో ఏపీకి అన్యాయం జరుగుతున్న తనకేమీ తెలియదన్నట్లే పవన్ వ్యవహరిస్తున్నారు. విభజన హామీల అమలు, వివాదాలు, పరిష్కారాలపై ఈనెల 17వ తేదీన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఆ సమావేశంలో తొమ్మిది అంశాలను చర్చింబోతున్నట్లు ఉదయం సర్క్యులర్ రిలీజైంది.





ఆ తొమ్మిది  అంశాల్లో ప్రత్యేకహోదా కూడా ఉంది. అయితే రాత్రికి అజెండా మారిపోయింది. తొమ్మది అంశాలు కాస్త ఐదుకు కుదించుకుపోయింది. ప్రత్యేకహోదా అంశం కూడా మాయమైపోయింది. ఈ విషయమై జనాల్లో కేంద్రంపై బాగా మంటలు మండుతున్నాయి. వైసీపీ-బీజేపీ-టీడీపీ నేతల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడి పెరిగిపోతోంది. ఇంత జరుగుతున్నా పవన్ మాత్రం ఎక్కడా ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. అసలు ప్రత్యేకహోదా అంశంతో తనకు ఏమీ సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు.





ఏపీకి కేంద్రం ఇంత అన్యాయం జరుగుతున్నా పవన్ ఎందుకు ప్రశ్నించటం లేదు ? అజెండాలో పెట్టిన అంశాన్ని ఎందుకు తొలగించారని కేంద్రాన్ని నిలదీయలేని పరిస్ధితుల్లో ఉన్నారు పవన్. తన కళ్ళముందే కేంద్రం అన్యాయం చేస్తున్న ప్రశ్నించలేని పవన్ మళ్ళీ ప్రశ్నించేందుకే పార్టీని పెట్టానని డప్పు కొట్టుకోవటం ఎందుకో అర్ధం కావటంలేదు. 24 గంటలూ 365 రోజులు పవన్ ప్రశ్నించేదెవరనయ్యా అంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే.





ప్రతిపక్షంలో ఉన్నపుడూ జగన్నే ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్నే ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడును ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్ష నేతను మాత్రమే టార్గెట్ చేసిన ఏకైక నేతగా పవన్ దేశంలో రికార్డు సృష్టించారు. అలాంటి పవన్ ఇపుడు కేంద్రాన్ని నిలదీయటానికి నోరు పడిపోయినట్లుంది. అందుకనే కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: