గత కొన్ని రోజుల నుంచి జగ్గారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ లో హాట్ టాపిక్ గా మారింది. అతను కాంగ్రెస్ ను వీడి వెళ్లనున్నట్లు అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ తరుణంలో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి ఇక కాంగ్రెస్ లోనే కొనసాగుతానని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే సంగారెడ్డిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మరింత ఉత్సాహం నింపే విధంగా కార్యకర్తలతో మాట్లాడారు. మొత్తం నియోజకవర్గంలో 75వేల సభ్యత్వాలు చేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా అన్ని చోట్ల 30 నుంచి 39 వేల సభ్యత నమోదు కాగా, సంగారెడ్డిలో మాత్రం ఏడు వేల లోపు కావడం గమనార్హం.

సభ్యత్వాలు చేయకపోతే మాత్రం తన పరువు పోయినట్లే అని కార్యకర్తలకు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి. క్యాడర్ లో జోస్ నింపడానికి ప్రయత్నించారు. అయితే తెరాసలో చేరే ప్రసక్తే లేదని బీజేపీ మాటే మనసులోకి రావద్దని అన్నారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మార్చి 21 వరకు తన వ్యూహాన్ని పొడగించినట్లు చెప్పుకొచ్చారు మార్చి 10 వరకు 75 వేల కాంగ్రెస్ సభ్యత్వాలు  పూర్తి చేయాలని కార్యకర్తలకు నిర్దేశించి, అదే నెల 21న సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించుకున్నారు. అంటే ఎవరు పార్టీకి దూరం కాకుండా కొత్త ఎత్తుగడ వేసినట్టు అర్థమవుతోంది.  సోనియా మరియు రాహుల్ గాంధీలను కలుస్తానని వారి నుండి సానుకూల స్పందన వస్తుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అలా కాకుంటే పార్టీ మారే ఆలోచన చేస్తానని అనడానికి కార్యకర్తలు పట్టించుకున్నట్లు కనిపించలేదు.

 అంటే తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పే ప్రయత్నం మాత్రం పక్కాగా చేశారని చెప్పవచ్చు. కొత్త పార్టీ పెట్టాలని కార్యకర్తలు ప్రశ్నించగా, అందరూ కాంగ్రెస్ లోనే కొనసాగాలన్న పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తాను అనుకున్నట్లుగానే జరిగిపోవడంతో సమావేశం తర్వాత కూడా జగ్గారెడ్డి రెట్టింపు ఉత్సాహంతో కనిపించారు. పనిలోపనిగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై కూడా ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని వాటిని అడ్డుకోవాలని కార్యకర్తలు చెప్పకనే చెప్పారు. రాజీనామా వ్యవహారంతో పార్టీ పెద్దలను తన వైపు తిప్పుకోవడంలో జగ్గారెడ్డి సక్సెస్ అయ్యారని తెలుస్తున్నది. ఏది ఏమైనా జగ్గారెడ్డి రూటే సపరేటు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: